కొడుకు తప్పుకి తాను ప్రాయశ్చిత్తుడు ఈ దత్తుడు!

దేశం నుంచే డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని తపన.. చేసాడు పాదయాత్ర.. డ్రగ్స్ భూతంపై దండయాత్ర!

By Admin

కొడుకు తప్పుకి
తాను ప్రాయశ్చిత్తుడు
ఈ దత్తుడు!
+++±+++++++++++++
సునిల్ దత్ జయంతి
06.06.1929
________
సురేష్..9948546286

✍️✍️✍️✍️✍️✍️✍️

మదరిండియానే మనువాడిన మనోహరుడు..
డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడిన ధీరోదాత్తుడు..
స్థిరచిత్తుడు
సునిల్ దత్తుడు..!

ఎంత నలిగిపోయాడో పాపం!
ఇతగాడేమో నిప్పు..
గారాల బిడ్డ..
వ్యసనాల అడ్డా
చేస్తుంటే తప్పు మీద తప్పు
కొడుకులో పరివర్తన
కోసం యాతన..
దేశం నుంచే డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని తపన..
చేసాడు పాదయాత్ర..
డ్రగ్స్ భూతంపై దండయాత్ర!

నిజజీవితంలోనూ హీరోనే
మంటల్లో నెచ్చెలి నర్గీస్..
ఇతగాడి సాహసాల సీరీస్
కాపాడి కధానాయికను
అయ్యాడు ఆమె జీవితానికే ఏలిక..అభినేత్రే అభిసారిక!
మదరిండియాలో తల్లీకొడుకులు..
నిజజీవితంలో
భార్యాభర్తలు..!!

రైల్వే ప్లాట్ ఫాం పై
సినీజీవితం మొదలు..
జీవితంలో ఎన్నో యాదేం..
ఖాందాన్ ను కాపాడుకుంటూ
వక్త్ కి అనుకూలంగా మసలుతూ..
జీవన గమనంలో మంచితనమే
ఏక్ హీ రాస్తా..
కిస్మత్ కా ఖేల్ ను ఎదుర్కొంటూ..
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా హమ్ హిందుస్తానీ
అని నిలబడ్డ షేరా..
ఇంటి పేరు సంషేరా..!
********

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version