15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలి -మంత్రి పొన్నం ప్రభాకర్

By Admin
  • *రవాణా శాఖ లో ఆదాయాన్ని పెంచడానికి పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించాలి*

*ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి*

  • *రవాణా శాఖ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు పూర్తి చేయాలి*
  • *స్కూల్ బస్సుల పై నిరంతర తనిఖీలు నిర్వహించాలి*
  • *15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలి*
  • *ఈవి పాలసీ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి*
  • *ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి*

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది సమీపిస్తుండటంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంత వరకు చేరుకున్నామని స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. పలువురు అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఆదాయ అన్వేషణ చేయాలని సూచించారు. వచ్చే కొద్ది రోజుల్లో రెవెన్యూ పెంచుకున్న నివేదిక కనిపించాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు ,కార్యాలయాలకు అవసరమైన కొత్త భవనాలు ,మౌళిక సదుపాయాలు ,డ్రింకింగ్ వాటర్ ,టాయిలెట్స్, సాంకేతిక పరిజ్ఞానం ,సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలు పై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు సేఫ్టీ పై స్కూల్ లు కాలేజీలలో రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి స్కూల్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలని ,కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఇది తప్పనిసరి ఉండేలా విద్యాశాఖ తో మాట్లాడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం యునిసెఫ్ సహకారం తీసుకోవాలని ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ లైసెన్స్ పొందే ముందు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్న వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రవాణా శాఖ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తి చేయాలని అందుకు సంబంధించి నివేదిక తయారు చేయాలని సూచించారు. కింది స్థాయి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుండి జేటీసీ వరకు ప్రమోషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. 15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్ ,ఇన్స్యూరెన్స్ ,ఆర్సి అన్నిటినీ చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా స్కూల్ టైమింగ్స్ లో విద్యార్థులు బస్సుల్లో ఉన్నప్పుడు కానీ తనిఖీలు చేయరాదని అధికారులకు సూచించారు. అదే విధంగా 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు గ్రీన్ టాక్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.

ఈవి పాలసీ పై మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈవి కంపెనీలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అభినందించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ పై విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని దీనిపై ప్రతి ఎలక్ట్రిక్ వాహనాల షో రూం ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. Csr ఫండ్స్ తో స్కూల్ లలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేయాలని ఈ వి కంపెనీల ప్రతినిధులు కోరారు..

ఆటోమాటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ,టెస్టింగ్ ట్రాకింగ్ ,డ్రైవింగ్ టెస్టింగ్ ,వెహికిల్ ట్రాకింగ్ పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహన సారథి అమలు ఆలస్యం చేయవద్దని సూచించారు. కొత్తగా వచ్చిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లను ఎన్ఫోర్స్మెంట్ లో ఉపయోగించాలని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రవాణా శాఖ కి ప్రత్యేక లోగో రాబోతుందని ప్రజా విజయోత్సవాల్లో దానిని పరిచయం చేయాలని సూచించారు. రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలు రాబోతున్నాయని , దాంతో పాటు డేటా ఎంట్రీ కోసం టాబ్ లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న డ్రైవింగ్ స్కూల్ లు ఎన్ని వాటి పనితీరు తదితర వాటిపై ఎన్ఫోర్స్మెంట్ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటిసి రమేష్ ,మమత ఇతర ఉన్నతాధికారులు

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version