ఎవ్వరిని వదిలేది లేదు అందరిని మడ్త పెట్టుడే – సిఎం రేవంత్ రెడ్డి గరుడ ప్లాన్                                

By Admin

ఎవ్వరిని వదిలేది లేదు అందరిని మడ్త పెట్టుడే – సిఎం రేవంత్ రెడ్డి Revanth Reddy సీరియస్ ప్లాన్

                                       గరుడ వ్యూహంలో రేవంత్ రెడ్డి

వదిలేస్తే బిజెపి తన్నుపోతుందని ముందస్తు వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను నాయకులను వదలడం లేదు

రాష్ట్రంలో ఆరు నెలల్లో రాజకీయంగా పెను మార్పలు సంభవించాయి.  ఓ దఫా అసెంబ్లి ఎన్నికలు జరిగి పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో  కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక్క సీటు కూడ గెల్చుకోలేక బొక్క బోర్లా పడింది.  భారతీయ జనతా పార్టి చాపకింద నీరులా విస్తరించి 8 లోక్ సభ స్థానాలను గెలుచుకుని కాంగ్రేస్ పార్టీకి సవాల్ విసిరింది.

 

కనీసం పది స్థానాలకు పైగా సాధించు కోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన కాంగ్రేస్ పార్టీకి కష్టంగా 8 స్థానాలు మాత్రమే దక్కాయి. ఆల్ రౌండర్ గానిలిచి కాంగ్రేస్ పార్టీని అధికారం లోకి తేగలిగిన రేవంత్ రెడ్డి ముందు రాజకీయంగాఅనేక సవాళ్లు నిలిచాయి. ఇప్పటికిప్పుడు  బిఆర్ఎస్ తో వచ్చిన నష్టం గాని కష్టం గాని లేదు కాని బిజేపీతో గట్టి ధ్రెట్ పొంచి ఉంది. పక్క రాష్ర్టంలో ఎన్డిఏ కూటమి అధికారం లోకి రావడం కూడ ఓ సవాల్ గా మారింది. ఎంతగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి గురువే అయినా ఇక్కడ రాజకీయం రాజకీయమే కదా. రాజకీయాలకు తారతమ్యాలు ఉండవు. స్వంత మామనే గద్దె దించి గద్దెనెక్కిన చరిత్ర కలిగిన చంద్ర బాబు నాయుడు రేవంత్ రెడ్డి కోసం త్యాగాలు చేస్తాడను కోలేం.

ఈనేపద్యంలో రాష్ర్ట ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు వల్ల ముప్పు ఏర్పడకుండా మరో వైపు బీజెపీ దూకుడును నిలువరించాల్సిన కర్తవ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉంది.

 

ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి గరుడ వ్యూహం అమలు చేసే పనిలో పడ్డాడు. గరుడ వ్యూహం అంటే గద్దలా కోడిపిల్లల్ని తన్నుకు పోవడం. ఇది గతంలో రెండు పర్యాయాలు గెలిచి ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆనుసరించిన వ్యూహం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలను అట్లాగే కాంగ్రేస్ పార్టి ఎమ్మెల్యేలను ఆయన ఇదే వ్యూహంతో తన్నుకు పోయాడు.

 

దీనికి ఏ విలువలు  ఉండవు. పార్టీ ఫిరా ఇంపు ఈ వ్యూహం ముందు పని చేయదు. గద్ద తన్నుకు పోయేందుకు సిద్దంగా ఉండడం ఏకంగా కోడి పిల్లలు  కూడ ఎదురేగి దానికి చిక్కడం  ఇదే గరుడ వ్యూహం అంటే అని ఓ రాజకీయ విశ్లేషకుడు మొన్నీ మద్య సెలవిచ్చాడు.

నిజమే అనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ లో రాజకీయ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణ మనుషులు ఎవరూ ఎమ్మెల్యేలుగా లేరు. అంతా డబ్బులున్న బడా బడా వ్యాపార వేత్తలే అన్ని పార్టీలలో నిలిచి గెలుస్తున్నారు. వీరంతా  ఓ అంచనాతో ఏ పార్టీ అధికారం లోకి వస్తుందో వారికున్న అవగాహన మేరకు సమాలోచనలు జరిపి ఆయా పార్టీలలో చేరి టెకెట్ లు పొంది కోట్లాది రూపాయలు వెచ్చించి గెలుస్తున్నారు. అంచనాలు తారుమారయ్యి తమ పార్టి ఓడి పోతే ఇక అంతే సంగతులు. తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు ఏం అవుతాయో నని అధికారంలో ఏ పార్టి ఉంటే ఆ పార్టీ సంకన చేరి పోతుంటారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి గరుడ వ్యూహంలో ఈజీగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవే కారణాలతో  చిక్కి పోతున్నారు. తనకు ఏ వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవని సగౌరవంగా ప్రకటించుకునే  సీనియర్ నేత కడియం శ్రీహరి తన కూతురు రాజకీయ భవిష్యత్ కోసం బిఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత చివరిక్షణంలో కాంగ్రేస్ పార్టీలో చేరాడు. బిడ్డను గెలిపించుకున్నాడు. నేడే రేపో మంత్రి కాబోతున్నాడనే  టాక్ ఉంది. ఇదే బాటలో పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి  గరుడ వ్యూహంలో ఎదురెళ్లారు. దాణం నాగేందర్ మొదలు, పట్నం మహేందర్ రెడ్డి, మాజి ఎంపి రంజిత్ రెడ్డి, పసునూటి దయాకర్ (మాజి ఎంపి -వరంగల్), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బిఆర్ఎస్ లో చేరారు.

కాంగ్రేస్ ఎ్మమెల్యేల జాబితా పెరిగి పోతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తరిగి పోతోంది. ఈ క్రమంలో ఆశ్చర్యంగా మాజిస్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రేస్ బాట పట్టారు.

మరో 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  కాంగ్రేస్ బాట పట్టనున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా వారితో చిట్ చాట్ సందర్బంగా చెప్పారు.

విచిత్రం ఏంటంటే ఓటుకు నోటు కేసులో మాజి సిఎం కెసిఆర్ కు అప్రువర్ గా మారి రేవంత్ రెడ్డిని రెడ్ హాండెడ్ గా పట్టించిన యెర్రబెల్లి దయాకర్ రావు కూడ కాంగ్రేస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వచ్చాయి. యెర్రబెల్లి దయాకర్ రావును బిడ్డా నిన్ను వదిలే ప్రసక్తి లేదంటూ రేవంత్ రెడ్డి తన యాత్ర సందర్భంగా పాలకుర్తిలో హెచ్చరించారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వతశత్రువులు అంటూ ఉండరు. ఇప్పుడు యెర్రబెల్లి దయాకర్ రావు కంటే రేవంత్ రెడ్డికి మరో శత్రువు నిలిచారు. ఆ శత్రువే బిజెపి రూపంలో ఉన్న ప్రమాదం.

ఇప్పుడిక బిఆర్ఎస్ పని అయి పోయింది. కెసిఆర్ దాదాపు జవసత్వాలుడిగిన మనిషిగా ఓపిక లేక వ్యూహాలు ఫలించక చతికిల పడి పోయారు. బిడ్డ జైళ్లో ఉంది. తనపైనా కుమారుడి పైనా అనేక అభియోగాలు విచారణ దశలో ఉన్నాయి. ఏక్షణం లోనైనా యూ ఆర్ అండర్ అరెస్ట్ అంటూ  కెసిఆర్ ఇంటికి  పోలీసులు రావచ్చు. ఈ పరిస్థితిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్లు తనకెందుకు వచ్చిన రిస్కు అంటూ బయటపడ్తున్నారు. అందుకే ఆయన  అభివృద్ది కోసమంటూ కాంగ్రేస్ కండువా దర్జాగా  కప్పుకున్నారు.

ఇతర ఎమ్మెల్యేలు సైతం తమకు అభివృద్ది ముఖ్యమని ఏ ముహూర్తం లోనైనా కాంగ్రేస్ కండువాలు కప్పుకోవచ్చు. ఇదే జరుగ బోతోంది. రాష్ర్టంలో అనేక మంది మున్సిపల్ చైర్మన్లు అవిశ్వాసాలకు భయపడి ముందే కాంగ్రేస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రేస్ లో చేరారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం అల్లా రాష్ర్టంలో వచ్చే ఐదేళ్ళలో అధికారం లోకి వస్తామని  బాజాప్తా చెప్పుకుంటున్న బాజపాను నిలువరించడం. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు బాజపా వైపు చూస్తున్నారు. ఎవ్వరిని వదలవద్దు. నాకు గతంలో పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఉంటే ఉండవచ్చు అందరిని లాక్క రండి అంటూ రేవంత్ రెడ్డి  పార్టి నాయకులకు పురమాయిస్తున్నారని లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రేస్ పార్టి  నాయకులు తమ పనిని స్పీడప్ చేశారు.

వారు వద్దు… వీరు… వద్దు అంటూ వదిలితే అందరిని బీజెపి నేతలు తన్నుకు పోతారని బిఆర్ఎస్ లో ఎవ్వరిని వదలవద్దని  రేవంత్ రెడ్డి సలహా మేరకు కాంగ్రేస్ పార్టి నేతలు పావులు కదుపుతున్నారు.

హైదరాబాద్ నగరంలో అత్యధిక శాతం గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను నయానా భయానా లొంగ దీసుకునే ఆపరేషన్ ఎప్పుడో ప్రారంబ మైంది. రేవంత్ రెడ్డి పై అనేక సార్లు బహిరంగ సవాళ్లు విసిరిన  విద్యా సంస్థల అధినేత  చామకూర మల్లారెడ్డి వంటి వారిని కూడ వదల వద్దని కాంగ్రేస్ తీవ్ర ప్రయత్నాల్లో ఉంది.

—-ఎమ్మార్కే

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version