జగన్మోహనరెడ్డి అనే నేను..ఇంతలో ఇలా..

Admin
By Admin

జగన్మోహనరెడ్డి అనే నేను..

అయిదేళ్ల క్రితం ఇదే రోజున_

ఇంతలో ఇలా.._

Why not..why note..!

మళ్లీ జగనా..
వేరొకరా..
ఆ విషయాన్ని పక్కన బెడదాం..ఆ గుట్టు మొన్న 13 వ తేదీనే ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది..ఓటరు రాసేసాడు..ఇక మార్చడం ఎవరి తరమూ కాదు.
ఇంకెంత..రేపు నాలుగో తేదీన ఆ బ్రహ్మాండం కూడా బద్దలైపోతుంది..!
ఇప్పుడు విషయం ఏంటంటే..తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇంత తక్కువ వ్యవధిలోనే ఉత్పన్నం కావడం..మొన్నటికి మొన్న..అంటే 2019 ఎన్నికల్లో అసలు ఎవరూ ఊహించని భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇంత తక్కువ కాలంలో..
నువ్వా నేనా అనే స్ధాయిలో
కూటమి నుంచి తీవ్రమైన
ప్రతిఘటన ఎదుర్కోవడం..
ఇది భారత రాజకీయాల్లో
ఓ అరుదైన ముఖచిత్రం..!(నిజానికి ముగింపు అనాలేమో..
కానీ తొందర పడి
ముందరే చెప్పడం దేనికని..)
మునుపటి ఎన్నికల్లో
చారిత్రాత్మక ఆధిక్యతతో
విజయం సాధించి..
అటు తర్వాత జరిగిన
అన్ని ఎన్నికల్లోనూ
అదే దూకుడును కొనసాగించిన
జగన్ పార్టీ అయిదు క్యాలెండర్లు చిరిగేలోగానే
చీటీ చిరిగిపోయే స్థితికి చేరుకుందంటే ఏమనుకోవాలి..
ఎవరిని అనాలి..!
ఓకే..రేపు కూడా అదే వైసిపి విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందనే అనుకుందాం..నిజానికి
ఏ లెక్కలూ కూడా
ఆ విషయాన్ని
అంత దృఢంగా చెప్పడం లేదు. అయినా గాని
మరోసారి జగన్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందనే అనుకుందాం.2019 మాదిరి
ఆధిక్యం వస్తుందా..
అది మాత్రం అసాధ్యం..
వైనాట్ 175 అనే సవాలు విషయంలో అంతటి
జగనే మడమ తిప్పేసారు.
అక్కడితో అయిపోలేదు కథ.
బిజెపితో పొత్తు కోసం తానే వెంపర్లాడే పరిస్థితి..నిజానికి
బిజెపి కేంద్రంలో
మళ్లీ అధికారంలోకి వస్తుందని గట్టి
అంచనాలు వినిపిస్తున్నా
ఉత్తరాదిలో కొంత మేర గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న
ఆ పార్టీ దక్షిణాదిలో
కొన్ని స్థానాలైనా కూడగట్టుకుని
మరోసారి కేంద్రంలో బలంగా పాగా వేయాలని భావిస్తోంది.
అలాంటి దశలో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా జగన్ మీద ఆధారపడే పరిస్థితి ఉండాలి.
అది లేకపోగా జగనే వెంటపడినా బిజెపి కాదనుకుని తెలుగుదేశం పార్టీతో జత కట్టింది.
నిజానికి 2019 ఎన్నికలకి
కొంతకాలం ముందు చంద్రబాబు అవలంబించిన
ధోరణిని బట్టి చూస్తే
కమలనాథులు బాబుతో కూడనే కూడకూడదు.
కానీ జగన్ను కాదని వారు బాబుతో మైత్రికే మొగ్గు చూపారు.ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో
ఆ పరిణామమే అత్యంత కీలకమైనది.జగన్ రెడ్డికి అదే పెద్ద మైనస్ పాయింట్ ఆనుకోవాలి.బిజెపి పెద్దలు ఎన్నో సర్వేలు చేయించుకుని..
చాలా విశ్లేషణలు చేసి ఈసారి జగన్ వద్దు..
బాబే ముద్దు అనే నిర్ణయానికి వచ్చారు.
ఇది మొన్నటి ఎన్నికల ఫలతాలపై కీలకమైన సంకేతమే.
*_ఎవరు ఔనన్నా..కాదన్నా..!_*
అసలు బిజెపి జగన్ను వద్దనుకోడానికి..ఈ ఎన్నికలు హోరాహోరీ జరిగి ఫలితం ఎటువైపు వుంటుందో
చెప్పలేనంత తీవ్రంగా పోటీ నెలకొనడానికి..కారణం ఎవరు..దారి తీసిన పరిస్థితులు ఏంటి..!?
నిన్న గాక మొన్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వైసిపి ప్రభుత్వం
బలంగా నడిచింది.జగన్ సూపర్ పవర్ అన్నట్టు చలామణి అయ్యారు.
అంతటి ఇందిరాగాంధీ..
ఎన్టీఆర్ కూడా సాధించని
ఏకపక్ష విజయాలను జగన్ సొంతం చేసుకున్నారు.
అయితే అంతలోనే జగన్ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలేంటి..?
పాలనా లోపాలు..
జగన్ పూర్తిగా పంపిణీ కార్యక్రమాలు..బటన్ నొక్కుడుపై ఆధారపడి
అభివృద్ధిని నిర్లక్ష్యం చెయ్యడం.
బాబాయ్ హత్య..
తదనంతర పరిణామాలు.
అప్పులు..తాకట్లు..
రోడ్లు తదితర
కనీస అవసరాల పట్ల
పూర్తి అశ్రద్ధ..
కేంద్రం నుంచి భారీ ఎత్తున రుణాలు..నిధుల కోసం ఢిల్లీపై పూర్తిగా కేంద్రంపై ఆధారపడి పోవడం వల్ల
రాష్ట్రానికి  సంబంధించి
కేంద్రాన్ని అడగడంతో రాజీ..
విశాఖ ఉక్కును ప్రైవేట్ కు అమ్మాలన్న ప్రతిపాదనను
బలంగా ప్రతిఘటించ
లేకపోవడం..
నిధుల కొరత..
ఆ నిధుల కోసం
ప్రభుత్వ ఆస్తులను..
కార్యాలయ భవనాలను
తాకట్టు పెట్టడం అనే దుస్సంప్రదాయానికి
ఒడికట్టడం..
మద్యనిషేధంపై మడమ తిప్పిన వైనం..
అమ్మిన మధ్యంలో నాణ్యత లేని బ్రాండ్లు..అవి కూడా నగదు అమ్మకాలు..
రాజధాని వ్యవహారం..
అంత మెజార్టీ ఉండి
కూడా రాజధాని తరలింపు
విషయంలో జాప్యం..
దీనిపై కుంటి సాకులు..
ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నా మంటూ పసలేని ప్రకటనలు..
విపక్ష నాయకుల పర్యటనలకు అడ్డుకట్ట వేస్తూ
వారికి సానుభూతి పెంచడం..
అదే సమయంలో కక్షపూరిత చర్యలు..
ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండకపోవడం..
పరాకాష్టగా ఎమ్మెల్యేలు..
ఇతర నాయకుల భూమి భాగోతాలు..
తల్లిని..చెల్లిని దూరం పెట్టడం..దూరం చేసుకోవడం..
సునీతారెడ్డి దుమారం..
వైనాట్ 175 సవాలు విషయంలో వెనకంజ…
అంతిమంగా కొన్ని నిర్ణయాల
కారణంగా ఉద్యోగుల్లో వెల్లువెత్తిన వ్యతిరేకత..
మరో కీలక అంశం..
ఇలాంటి అన్ని కారణాల వల్ల పెరిగిన నెగిటివిటీ..
రేపు ఫలితం అటూ ఇటూ
అయితే అది కూటమి విజయం కాదు..
ముమ్మాటికీ జగన్ ఓటమి..
2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన
టీఆర్ఎస్ 19లో కూడా తెగ్గేదేలే అంటూ మళ్లీ గెలిచింది..సరే..మూడో ప్రయత్నంలో బోర్లా పడింది.
అదే 2014లో కాంగ్రెస్ కూటమిని త్రోసిరాజని
కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి 19లో కూడా
శంశేర్ గా గెలిచి ఇప్పుడు మూడో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది.
నిజానికి కేసీఆర్..మోడీని మించి ఆంధ్రలో ఘనమైన
గెలుపు సాధించిన జగన్మోహనరెడ్డి 2024 నాటికి  ఓడిపోతారేమో
అనే స్ధాయిలో  ఇలా గట్టి పోటీ ఎదుర్కోవలసి రావడం..
ఒకరకంగా

*_స్వయంకృతమే..!_*

*_సురేష్..జర్నలిస్ట్_*

  *_9948546286_*

Share This Article
Leave a comment