నెహ్రూ కుటుంబ రికార్డులను మోదీ అధిగమించనున్నారా ?
సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోది అదృష్ట పరీక్ష ఫలించేనా
భారత దేశ ప్రధాన మంత్రుల్లో ఇప్పటి వరకు అంటే 18 వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్న 2024 సంవత్సరం నాటికి అనేక మంది ప్రధాన మంత్రులుగా పనిచేసారు. ఇప్పటి వరకు పనిచేసిన ప్రధాన మంత్రుల్లో ఎక్కువ కాలం పని చేసిన రికార్డు తొలి ప్రాధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది. ఆయన తదనంతరం ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని భారత దేశ రాజకీయాలతో పాటు ప్రపంచ దేశాలలో అత్యంత శక్తి వంతమైన మహిళా ప్రధాన మంత్రిగా గుర్తింపు పొందిన శ్రీమతి ఇందిరాగాంధి ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానిగా రెండో స్థానంలో నిలిచారు. నెహ్రూ భారత తొలి ప్రాధాన మంత్రిగా పనిచేసి ఆతర్వాత మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రేస్ పార్టి సారద్యంలో ప్రధాన మంత్రిగా 16 సంవత్సరాల 286 రోజులు పనిచేసారు.
యూనియన్ ఆఫ్ ఇండియాలో 1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27 మరణించే వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఇండియన్ రపబ్లిక్ యూనియన్ ఏర్పడే వరకు ఆయన తాత్కాలిక మధ్యంతరం ప్రధాన మంత్రిగా పనిచేసారు. 15 ఆగస్టు1947 నుండి 1950 జనవరి 26 వరకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించే వరకు తాత్కాలిక మధ్యంతర ప్రధాన మంత్రిగా ఆ తర్వాత 1964 మే 27 వరకు మూడు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసారు.
నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్ర్తి 1964 జూన్ 9 నుండి 1966 జనవరి 11 వరకు ఏడాది పైన 216 రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసి ఆకస్మిక మరణం పొందారు. నెహ్రూ మరణానంతరం గుల్జారి నంద లాల్ బహదూర్ శాస్ర్తి ప్రధానిగా పదవి ప్రమాణ స్వీకారం చేసే వరకు 13 రోజులు తాత్కాలిక ప్రధాని మంత్రిగా పనిచేశారు.
లాల్ బహదూర్ శాస్ర్తి అనంతరం జవహర్ లాల్ నెహ్రూ కూతురు ప్రియదర్శిని ఇందిరా గాంధి భారత తొలి మహిళా ప్రధాన మంత్రిగా 1966 జనవరి 24 న పదవి భాద్యతలు చేపట్టారు. ఆతర్వాత వరుసగా ఆమె 1977 మార్చి 24 వరకు ప్రధాని పదవిలో 11 సంవత్సరాల 59 రోజులు కొనసాగారు. ఇందిరా గాంధీకి దేశంలో ఎదురు గాలి వీచడంతో ఎమర్జెన్సి విధించడంతో దేశ వ్యాప్తంగా వ్యతిరేకత మరింతగా పెరిగి చివరికి ఆమె 1977 లో ఘోరపరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జైళు కు కూడ వెళ్లాల్సి వచ్చింది.
1977 లో జనతా పార్టి సారద్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో మొదటగా మోరార్జి దేశాయి అతర్వాత చరణ్ సింగ్ ప్రధాన మంత్రులుగా పనిచేశారు. 1980 లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధి సారద్యంలో ఏర్పడిన ఇందిరా కాంగ్రేస్ అత్యధిక స్థానాలు గెలిచి తిరిగి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా బాద్యతలు చేపట్టారు.
నెహ్రూ మొత్తంగా 16 సంవత్సరాల 286 రోజులు ఇందిరా గాంధి మొత్తంగా 15సంవత్సరాల 350 రోజులు పనిచేశారు.
ఆ తర్వాత డాక్టర్ మన్ మోహన్ సింగ్ వరుసగా రెండు దఫాలుగా ప్రధానిగా 2004 నుండి 2014 వరకు పనిచేశారు. ఆతర్వాత నరేంద్ర మోదీకే వరుసగా రెండు దఫాలుగా అవకాశాలు దక్కాయి.
18 వ లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోది తన అదృష్టాన్ని వెదుక్కుంటున్నారు. మూడో సారి నెగ్గి హాట్రిక్ కొట్టాలని తాపత్రయ పడుతున్నాడు. అయితే ఎంత వరకు ఆయన కోరిక నెర వేరుతుందో లేదో తెలియదు కాని తీవ్ర పోటి నెల కొంది.
దేశంలో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు లౌకిక శక్తులకు హిందుత్వను సమర్దించే ఏకపక్ష వాదులకు మద్య జరుగుతున్న వాతావరణం గోచరిస్తోంది