ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఎందుకు మీడియా తో మాట్లాడరు

Admin
By Admin

Why PM Modi  doesnot hold press conferences

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఎందుకు మీడియా తో మాట్లాడరు

 

ఇది భారతీయ పౌరసమాజం లేవనెత్తిన  ఓ జవాబు దొరకని ప్రశ్న. గత దశాబ్ద కాలంగా ఈ దేశంలో మీడియా ప్రతినిధులతో పాటు ప్రతిపక్షాలు అనేక సార్లు ప్రధాన మంత్రి మోది వైపు తమ చూపుడు వేలు గురి పెట్టినా ఫలితం లేక పోయింది.  మోది మీడియాతో మాట్లాడరని కాదు కాని  సామూహిక మీడియా కాన్పరెన్సులకు దూరంగా ఉండడాన్ని ప్రశ్నిస్తున్నారు.

మోది  ప్రధాన మంత్రిగా 2014 లో భాద్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏనాడు అధికారికంగా మీడియా కాన్ఫరెన్సుల్లో మాట్లాడ లేదు. మీడియాకు దూరమయ్యారా అంటే అదేం లేదు. ప్రజలకు చేరవేయాల్సిన  సమాచారాన్ని  నిరంతరం  చేరవేసారు. ప్రధాన మంత్రి నిర్వహించిన  “మన్ కీ భాత్” చాలా పాపులర్ అయ్యింది. కోట్లాది మంది మూలన పడేసిన రేడియోలను తిరిగి ముందు పెట్టుకుని ఆయన ప్రసంగాలు విన్నారు. ప్రధాని ఏం మాట్లాడారో  ఈ రేడియో ప్రసంగాలను దృష్య మాద్యమాలు, పత్రికలు ఫాలో అయి వాటిని ప్రజలకు చేరవేయక తప్పలేదు.

ప్రధాన మంత్రికి అధికారికంగా ఇంకా వ్యక్తిగతంగా ఎక్స్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాం, లింకిడిన్ తో పాటు అన్ని  సోషల్ మీడియా వేదికల ఖాతాలు ఉన్నాయి. నరేంద్ర మోది పేరిట స్వంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఎప్పటికప్పుడు ఆయన కార్యక్రమాలు లైవ్ లో దేశ ప్రజలకు  అందుతుంటాయి. మెయిన్ స్ర్టీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా ఇప్పుడు ఆన్ లైన్ లో డిజిటల్ ప్లాట్ ఫాం నే ప్రధాన వేదికగా ఎంచుకుని ప్రజలకు వార్తలు చేరవేస్తున్నాయి.  ఆదునిక పద్దతుల్లో  ఇప్పుడు చాలా మంది  పాలిటిషన్లు సోషల్ మీడియా ఖాతాలను తెరిచి తమ సమాచారాన్ని చేరవేయడంలో ఇదే పద్దతి అనుసరిస్తున్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలు వారి ఖాతాలను అనుసరించి వార్తల రూపంలో ఇస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కొత్త ట్రెండ్. ఇదంతా అందుబాటులోకి వచ్చిన కొత్త  డిజిటల్ ప్లాట్ ఫాం మహిమ. చెరవాణిలో ఎప్పటి కప్పుడు వార్తల అప్ డేట్స్ క్షణాల్లో తెల్సి పోతున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోది సామూహికంగా మీడియా కాన్ఫరెన్సులు నిర్వహించక పోవడం వల్ల భారత దేశంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన నష్టం ఏంటట అని అడిగే వారున్నారు. ఈ విషయంలో విమర్శించే వారు ప్రధాన సమర్దించే వారు ఉన్నారు.

నష్టం లేదు…లాభం లేదు…సాధికారతతో  జర్నలిస్టులు ఏం ప్రశ్నలు లేవనెత్తురాతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బాగా తెల్సు. అడిగే ప్రశ్నలకు జవాబుల్లో డొల్లతనం బయట పడితే ఇమేజీకి నష్టం. అందుకే ప్రెస్ కాన్పరెన్సులకు మోది దూరంగా ఉన్నారని అర్దం చేసుకోవాలి.

18వ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మూడోసారి హాట్రిక్ కోసం తాపత్రయ పడుతున్న మోది సెలెక్టెడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అరేంజుడ్ ఇంటర్వ్యూలలో సెలెక్టెడ్ ప్రశ్నలు జవాబులే ఉంటాయి. ఏకపక్షంగా ప్రధాన మంత్రి చెప్పదల్చుకున్న విషయాలపైనే ముందస్తుగా నిర్ణయించిన ప్రశ్నలు జర్నలిస్టులు వేస్తుంటారు. అంతా స్టేజి మానేజి వ్యవహారం.

టి.వి డబ్బాల్లో కూర్చుని  బాగా అరిచి గగ్గోలు పెట్టే అర్నబ్ గోస్వామి అందరిని ప్రశ్నలతో అదరగొడుతుంటారు. బెదిరిపోయేలా గుక్క తిప్పుకోనీయకుండా అడ్డ దిడ్డమైన ప్రశ్నలు వేస్తాడు కాని ప్రధాన మంత్రి దగ్గర మాత్రం  వినయంగా ప్రశ్నలడుగుతుంటాడు.

గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడ మోది ఎక్కువగా ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించిన దాఖలాలు లేవు. అదే ఒరవడి ఆయన ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడ కొనసాగిస్తున్నారు.

మీడియా  ఇబ్బంది పెట్టే రీతిలో అడిగే ప్రశ్నలకు భయపడి మోది దూరంగా ఉంటున్నారా అంటే ఖచ్చతంగా ఎస్ అనే చెప్పాలి. గోద్రా అల్లర్ల అనంతరం నుండి  నరేంద్ర మోది వ్యూహాత్మకంగానే సామూహిక మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

ప్రజాస్వామ్యంలో వాచ్ డాగ్ రోల్ నిర్వహించే జర్నలిస్టులతో  సాధికారంగా సాగే కాన్ఫరెన్సులు అంటే ఏవైనా ప్రశ్నలు అడగొచ్చు. ప్రశ్నలపై ఆంక్షలు, పరిమితులు లేకుండా వాటిని ఎదుర్కోవాలి. జవాబులు చెప్పాలి.

భారత దేశంలో  ఇప్పటి వరకు ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారెవరూ సామూహిక మీడియా కాన్ఫరెన్సులకు దూరంగా లేరు. మీడియా గిట్టని వాటిని నచ్చని వాటిని అడిగినా ఓర్పుగా సమాధానాలు చెప్పేవారు.

వ్యక్తి గత విషయాలపై కూడ జర్నలిస్టులు అడుగుతారు. ఎందుకంటే  అవి పౌర సమాజం నుండి ఉత్పన్నం అయ్యే ప్రస్నలు.

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అయితే తన స్వంత పత్రిక “నేషనల్ హెరాల్డ్” లో

ఎలాంటి ఆంక్షలు లేని రాతలను ప్రోత్సహించారు. 1932 లో స్వాతంత్ర్య ఉద్యమం ఉధృత మైన కాలంలో ఈ పత్రిక ఏర్పాటు చేసారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలు స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక ప్రధాన ఘట్టాలలో ఈ ఇంగ్లీషు పత్రిక  కీలక పాత్ర పోషించింది.

నెహ్రూ ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడ ఈ పత్రికలో నెహ్రూకు అనేక వ్యతిరేక వార్తలు కార్టున్లు వచ్చినా నెహ్రూ అభ్యంతరాలు చెప్పకుండా ఇంకా అలాంటి వాటిని ప్రోత్సహించారని చెబుతుంటారు.

నరేంద్ర మోది కంటే ముందు పదేల్లు ప్రధాన మంత్రిగా ఉన్న  డాక్టర్ మన్ మోహన్ సింగ్ ను అందరూ మౌన ముని అన్నారు కాని ఆయన 2004 నుండి 2014 వరకు  117 సార్లు  ప్రెస్ కాన్పరెన్సు నిర్వహించారు,

ప్రధాన మంత్రి నరేంద్ర మోది తన వైఖరిని సమర్దించు కుంటూ ఇలాంటి విమర్శలకు ప్రధాన మంత్రి తన ఏకపక్ష ఇంటర్వ్యూలలో ఇచ్చిన జవాబు ఏంటంటే “మీడియా ఒక నాటి మీడియాలా లేదు” అని చెప్పడం.

కావచ్చు కాని ఈదేశంలో ఇప్పటికి పౌరుల పక్షాన పవర్ ఆఫ్ ఆటార్నీ పుచ్చుకున్న జర్నలిస్టులు మీడియాలో ఉన్నారు. కరప్ట్ అయిన మీడియా గురించి మాట్లాడటం అనవసరం. అన్ని రంగాలలో అవినీతి పాకి పోయినట్లే మీడియాలో కూడ పాతుకు పోయింది. కాని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత దేశంలో మీడియాది 24 బై 7 వాచ్ డాగ్ పాత్ర. నిరంతరాయంగా ఈ దేశ బాగోగుల కోసం పహారా కాస్తున్న జర్నలిస్టులు ఉన్నారు కనుకనే ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ మాత్రం అయినా రక్షణలో ఉంది. అడిగే ప్రశ్నలకు భయపడి మీడియాకు దూరంగా ఉండడం ప్రజాస్వామ్య విలువలకు, సాంప్రదాయాలకు మంచిది కాదు.

సెలెక్టెడ్ మీడియా కాన్ఫరెన్సులు  ప్రజాస్వామ్యంలో పూర్తిగా  కరప్టెడ్ కన్ఫెషన్స్ గా భావించాలి. వాటి వెనకాల దాగి ఉన్న విధానాలను తప్పు పట్టకుండా ఉండలేం.

—-ఎమ్మార్కె

 

 

TAGGED:
Share This Article
Leave a comment