ఐఏఎస్..
అన్నిటికీ ఎస్ అంటే ఎలా..!?
అన్నిటికీ ఎస్ అంటే ఎలా..!?
ఇంతకీ ఏం జరిగిందో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో..
ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల
విషయంలో..!?.
అసలు జగన్మోహన రెడ్డి ఐఏఎస్ అధికారులకు
అచ్చిరారేమో..ఆయన ముఖ్యమంత్రి కాకమునుపే అయ్య రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారుల చేత ఇష్టం వచ్చిన రీతిలో సేవలు చేయించుకుని
ఆనక తనతో పాటు కొందరు అధికారులను కూడా ఇక్కట్ల పాల్జేసారు.తన వెంట జైలుకి కూడా పట్టుకుపోయారు.శ్రీలక్ష్మి అయితే మరీ బాధలు పడ్డారు.
2019 లో జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అధికారులు మళ్ళీ ఉన్నత స్థానాలకు చేరినా..ఆ అయిదేళ్లలో ఏం పనులు చేయించుకున్నారో మరి
ప్రభుత్వం మారేపాటికి
ఐఏఎస్ అధికారుల పని
కుడితిలో పడిన ఎలకల మాదిరి అయిపోయింది.
ఇప్పటికీ కొందరు అధికారులు
జగన్ పట్ల విశ్వాసంగా ఉండి
స్వయంగా రికార్డుల ధ్వంసం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నా కొందరు మాత్రం ఇతరత్రా బెంబేలెత్తి పోతున్నారు.చంద్రబాబు వద్ద అందరి జాతకాలూ ఉన్నాయి.
కొందరిని ఇప్పటికే దూరం పెట్టేసారు.చాలా మందికి స్థానచలనం కల్పించారు.
ఒక పెద్దమనిషైతే ఏకంగా
స్వచ్ఛంద పదవీవిరమణ
గావించేసారు.కొందరు సెలవుపై వెళ్లిపోతున్నారు. ఇంకొకరు పరారై పోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్ని కథలు వినవలసి ఉందో..!?
ఎందుకొచ్చిన ఈ తంటాలు..
ఇలాంటి పుర్రాకులు..
ఐఏఎస్ అంటే ఎంత గౌరవం..
ఎంత హోదా…ప్రభుత్వం చెప్పినట్టు చెయ్యాలి అనేది
ప్రామాణికమే కావచ్చు..కానీ ఏం చెయ్యమంటే అది.. వెనకాముందూ ఆలోచించకుండా చెయ్యమని
ఏ రాజ్యాంగమూ చెప్పలేదు.
అలా చేస్తే ..ఇదిగో ఇలా వ్యక్తులకు చేటు..వ్యవస్థకు సిగ్గుచేటు..!