మౌనమె నీ భాష..!

Admin
By Admin

మౌనమె నీ భాష..!
++++++++++++++++++
బాలచందర్ పుట్టినరోజు
09.07.1930

 

“””””””””””””””””””””””””””””””””””””
ఒకనాటి
సత్తికాలపు సత్తయ్య
ఆయన
గుప్పెడంత మనసులో
ఎన్ని ఆలోచనలో..
అసలు ఆయన
సినిమా ప్రయాణమే
ఓ అంతులేని కథ
ఆ ప్రయాణంలోనే
సృష్టిస్తూ మరోచరిత్ర..

బాలచందర్..
ఓ డిక్షనరీ..డిక్షన్..
ఆయన సినిమాలే
పెద్ద అడిక్షన్..
ఆయన నిర్మాణ సంస్థ కవితాలయ..
ఆయన లోగిలి నటనాలయ..
ఆయన కంటి సైగే
కమల్ నాట్యానికి లయ
ఆయన సినిమాతోనే
జయప్రద అయింది
అందమైన అభినయ!

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
బస్ కండక్టర్ అయిపోయాడు తిరుగులేని సూపర్ స్టార్..
భలె భలె మగాడివోయ్
ఈ పాటతో అయిపోలేదా
కమల్ ఎనభైల నాటి
లవర్ బాయ్..
నల్ల పొన్ను సరితకు
పొట్టి గౌను తొడిగి
ఆమెలో చక్కని నటిని పొదిగి
చేయించిన చిలిపి పనులకు
కోటిదండాలు..
ప్రేక్షకులు ధియేటర్ వదిలిపోకుండా సీట్లకు
కట్టేసి అరదండాలు..
నటనే రాదనుకున్న దీక్షిత్తు..
శరత్ బాబు
అయ్యాడు సాక్షాత్తు..
ఏమిటి లోకం
పలుగాకుల లోకం..
ఫటా ఫట్ జయలక్ష్మిది
అదో మైకం..
హాల్లో మై డియర్ రాంగ్ నంబర్
పులుసు వై విజయకీ
ఆయన సినిమాల్లో
మెగా ఆఫర్..!
ఇక వెండితెరకు లేటుగా వచ్చిన లేటెస్ట్ సంచలనం
ప్రకాష్ రాజ్ దీ
బాలచందర్ బడే..
ఇలా ఎందరో సెలబ్రిటీలకు
ఆయన ఇల్లు అమ్మ ఒడే..
కొన్ని ప్రయోగాలు
ఈ దాదా సాహెబ్ పాల్కే సృష్టించిన ఒరవడే…!
_________
దర్శక దిగ్గజం కె బాలచందర్
జయంతి సందర్భంగా
ప్రణామాలు అర్పిస్తూ..

********


ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Share This Article
Leave a comment