మండలిపై రేవంత్ రెడ్డి “కమండల” వ్యూహం

Admin
By Admin
సిఎం రేవంత్ రెడ్డి డిల్లీ నుండి తిరిగి వచ్చిన అర్ద రాత్రి ఆయన నివాసంలో కాంగ్రేస్ పార్టీలే చేరిన అరడజను బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు

SIX BRS MlC’S Joined in Congress Party at Mid Night CM Revanth Reddy Residence

శాసన మండలిపై సిఎం రేవంత్ రెడ్డి భారి స్కెచ్

మండలిని వశపరుచుకోవడమే లక్ష్యంగా గురి
అర్ద రాత్రి అరుగురుఎమ్మెల్సీల చేరికలు

భారత రాష్ట్ర సమితి ఆధీనంలో ఉన్న శాసన మండలిలో ఆ పార్టీని జీరో చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి భారి స్కెచ్ వేశారు.

శాసన మండలిలో కాంగ్రేస్ పార్టీకి బలం లేదు. మండలిలో 40 మంది ఎమ్మెల్సీలలో కాంగ్రేస్ కు ఇటీవల గెలిచిన తీన్మార్ మల్లన్నతో కల్సి కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ఎమ్మెల్సీలున్నారు. భారతీయ రాష్ర్ట సమితి పార్టీకి 36 మంది ఎమ్మెల్సీలున్నారు.
మండలిలో కాంగ్రేస్ మాట నెగ్గాలన్నా పట్టుసాధించాలన్నా గట్టి బలం అవసరం. అందుకోసం సిఎం రేవంత్ రెడ్డి మండలి పై దృష్టి సారించాడు.
ఇందులో భాగంగా భారాస పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు , బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, దండె విఠల్,భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం కాంగ్రెసులో పార్టీలో చేరారు.
వీరంతా కాంగ్రేస్ పార్టి తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినప్పటికి వీరి చేరిక నాటకీయంగా జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి గురువారం అర్ద రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో వీరంతా అయన ఇంటికి వెళ్లి కాంగ్రేస్ పార్టి కండువాలు కప్పుకున్నారు. అంత అర్ద రాత్రి ఆఘ మేఘాలపై ఎందుకు ఇలా పార్టీలో చేరికలు జరిగాయనేది తెలియదు. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చే ఆరుగురు ఇతర కాంగ్రేస్ నేతలు అంతా ఓ హోటెల్ లో వేచి చూసి రేవంత్ రెడ్డి ఇంటికి చేరిన తర్వాత అంయన ఇంటికి వెళ్లారు. వీరి చేరిక విషయం మీడియాకు కూడ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
పార్టి వ్యవహార ఇన్ చార్జి దీపా దాస్ మున్షి, కాంగ్రేస్ పార్టి మోస్ట్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేము నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు వీరి చేరిక సమయంలో ఉన్నారు.

ఎమ్మెల్సీలలో చాలా మంది గతంలో కాంగ్రేస్ పార్టీలో కొనసాగిన వారే. మాజి మంత్రి బస్వరాజు సారయ్య ఉమ్మడి రాష్ర్టంలో మంత్రిగా పనిచేశారు. బండ ప్రకాశ్ కూడ కాంగ్రేస్ పార్టీలే పనిచేసారు. వీరిద్దరూ కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డికి అనుంగు శిష్యులు. వీరితో పాటు ఇతర ఎమ్మెల్సీల చేరిక విషయంలో రామసహాయం సురేందర్ రెడ్డి ఇన్ఫ్ల్యూ యెన్సు బాగా పనిచేసి ఉంటుందని ఆయన ఉపస్థితిని బట్టి అర్దం అవుతోంది.
రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టి మండలిలో మైనార్టీలో ఉండడం నామోషీగా భావిస్తోంది. ఎట్లాగైనా మండలిలో “కమండలం” హస్తగతం చేసుకోవాలని తీవ్ర యత్నాల్లో ఉంది. గతంలో ఉన్న నలుగురు ఎమ్మెల్సీలతో పాుట ఇ్పపుడు చేరిన వారితో కాంగ్రేస్ సంఖ్య 10 కి చేరింది. మరి కొద్ది రోజుల్లో ఆ సంఖ్యను పెంచుకుని మండలిని వశపర్చుకోవాలనేదే కాంగ్రేస్ పార్టి వ్యూహంగా కనిపిస్తోంది.

—ends

Share This Article
Leave a comment