నటరాజ పాద సుమరజం
అదే కమలిజం..!
*********
సాగరసంగమం సినిమాకి
నలభై రెండు..03.06.1983
********
గుర్తింపునకు నోచుకోని
ఓ కళాకారుడి వేదన..
ప్రేమ దూరమై..
బ్రతుకు భారమైన
ఓ నిర్భాగ్యుడి మౌనరోదన..
కష్టనష్టాల సమాగమం..
సాగరసంగమం..!
అదే కమలిజం..!
*********
సాగరసంగమం సినిమాకి
నలభై రెండు..03.06.1983
********
గుర్తింపునకు నోచుకోని
ఓ కళాకారుడి వేదన..
ప్రేమ దూరమై..
బ్రతుకు భారమైన
ఓ నిర్భాగ్యుడి మౌనరోదన..
కష్టనష్టాల సమాగమం..
సాగరసంగమం..!
కైలాసాన కార్తీకాన
శివరూపం
ప్రమిదే లేని
ప్రమదాలోక హిమదీపం..
నవరస నటనం..
జతియుత గమనం..
ఎంత అద్భుతమైన నర్తనం
ఇంకెంత అపురూపమైన
నటనం..
కమల్ కే చెల్లిన
అభినయం_
కళాతపస్వి మాత్రమే చెయ్యగలిగిన మథనం
సాగరసంగమం!
వేయ్ వేలా గోపెమ్మల
మువ్వాగోపాలుడే..
ఆ ముద్దు గోవిందుడే..
మంచి పాట..
మంచి సాహిత్యం..
మిశ్రో చేతిలో
బూతు భంగిమల
మిశ్రమమైపోతే
తన శ్రమ వ్యర్థమైపోతే
ఎప్పటికీ తీరని
బాలక్రిష్ణ తృష్ణ..
సాగరసంగమం..!
పంచ భూతములు
ముఖపంచకమై..
ఆరు ఋతువులు
ఆహార్యములై..
ఆహార్యంపై ఆసక్తి తప్ప
అభినయంపై అనురక్తి లేని
అప్ కమింగ్ ఆర్టిస్టుకి
ఔట్ డేటెడ్ కళాకారుడి
సకల నాట్యరీతుల క్లాస్
అలా తిరుగులేని క్లాసిక్
సాగరసంగమం..!
మౌనమేలనోయి
ఈ మరపురాని రేయి..
మదిలోని గదిని జీవితాంతం తెరవలేని
ఓ జంట మౌనవేదన
కన్నబిడ్డ శోధన
కోపంతోనే నాట్యసాధన
వేదం..అణువణువున _నాదం..
నా పంచ ప్రాణముల
నాట్య వినోదం
నిజం తెలిసేపాటికి ముంచుకొచ్చిన విషాదం..
దరి లేని కళకు
శాశ్వత విరామం..
సాగరసంగమం..!
ఇద్దరు మిత్రుల బంధం..
ఇద్దరు ప్రేమికుల మౌనబంధం
ఇళయరాజా లయవిన్యాసం
స్వర్ణ’కమల’
అభినయం..
పూర్ణోదయ జయప్రదం
చిత్రంగా ‘శరత్’ కాల
మైత్రీబందం
మనోజవం..శైలజం..
కళాతపస్వి మరో తపస్సు
అందమైన ఉషస్సు
హృదయంగమం
సాగరసంగమం..!
💃🎻☔🧚🏿♀️🎻💃🧚🏿♀️
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
9948546286