నోరా వీపుకి తేకే..! అంటే ఇదే మరి !

Admin
By Admin

నోరా వీపుకి తేకే..!

పెద్దలు చెప్పిన ఈ శుద్ది
కొందరు బుద్ధి లేని నాయకులకు ఎక్కుతుందా..

జజజ్జ రోజా..
సర్దేసింది మేజా..
ఇంతకు ముందు ఐరెన్ లెగ్ అన్నారు.పోనీ ఈసారి
వైసిపిలో ఉన్నా ఆ పార్టీ గెలిచింది గనక చెడ్డపేరు పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు.

అది నోరా..
అది భాషా..
స్త్రీ నోటి నుంచి రావాల్సిన మాటలా..

రాజకీయమంటే జబర్దస్తా..
అందులోనూ
ఎక్స్ట్రా జబర్దస్తా..

దానిని మించి హై జబర్దస్తా..

అంత అహంకారమా..

రాజకీయం ఎక్కడ మొదలైంది..
ఎవరు రాజకీయ భిక్ష పెట్టారు..
పోనీ అదంతా పక్కన బెడితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఆ మనిషి వయసు ఎంత..
ఆయన స్దాయి ఏంటి..
నీ స్థాయి ఏంటి..!

ఈరోజున ఈ రోజా..
వైసిపి ఇలాంటి ఘోర పరాభవాన్ని ఎదుర్కోడానికి ప్రధాన కారకురాలు..!

కొడాలిపై కొడవలి దెబ్బ..!

కొడాలి నాని..
ఈ వ్యక్తికి అసలు
సభా మర్యాద..
సంప్రదాయం..
మనుషుల పట్ల గౌరవం..
నాగరిక భాష..ఇవేవీ లేవు.

ఎక్కడ రజనీకాంత్..
ఎక్కడ నువ్వు..
ఆయన స్థాయి ఏంటి..
నీ స్థాయి ఏపాటిది..
రజనీకాంత్ సూపర్ స్టారనే విషయం పక్కన బెడడాం.
ఆయన దేశం మొత్తం గౌరవించే కళాకారుడు.
వయసులో పెద్దవాడు..
ఆయన చంద్రబాబు నాయున్ని పొగిడితే కొడాలికేమైంది.. ఆడు..ఈడు..
అక్కడ హీరో..ఇక్కడ జీరో..
ఇవా మాటలు..
ఇప్పుడు ఏమైంది..
ఆయన ఎప్పటికీ హీరోనే..
మరి నువ్వు.. జీరోవా..
అది నీ విజ్ఞతే..
అన్నట్టు ఆ విజ్ఞత లేకనే
ఇంతవరకు వచ్చింది.

అలాంటి ఒక హీరో
మద్దతుతోనే మునుపు గెలిచింది మరచి ఏంటా బలుపు.చంద్రబాబు వయసెంత..నీ వయసెంత..
ఆడు..ఈడు..
ఆ భాషే ఈరోజున జగన్
పేషీకి పొగపెట్టేసింది.

సలహాదారుల పెడదారులు..

లక్షల రూపాయల వేతనాలు..దేనికి..
ఉచిత సలహాల కోసం కాదు.. చెత్త మాటలు చెప్పేందుకు..ఇంచుమించు అందరూ స్వకులం వారే..
అవసరమా..!

వీరంతా అధినేత మెప్పు కోసం విపక్ష ఆయన కక్ష దీరా తిట్టి ఇంతటి
ముప్పు తెచ్చారు.

సజ్జల..ఇనుప గజ్జెల శబ్దం

ధనుంజయ..కామధేనువు అనుకుంటే విరిగిపోయిన ధనువు..

బ్రహ్మానంద..బ్రహ్మరథం అనుకుంటే బ్రహ్మాండం బద్దలు చేసేసాడు..

చంద్రశేఖర..ఇతగాడి వైఖరిపై జనం చండ్ర నిప్పులు..

చంద్రహాస.. పరిహాస..

లోకేశ్వర్..నా నోటితో అనలేను..పేరు ముందు
మీరే బో చేర్చుకోండి..ప్లీజ్

మధుసూధన్..మధుసోదిన్..

వీరారెడ్డి..వీర ప్రగల్భాలు..

విద్యాసాగర్..మిథ్యాసాగరం!

ఈ అందరి పేర్ల చివర
జగన్మోహన్ రెడ్డి పేరు చివరన ఉన్న రెండక్షరాలే..
జీతాలు లక్షల్లో..సౌకర్యాలు
నక్షత్ర హోటళ్ల లెవెల్లో..
చెప్పింది దొంగ లెక్కలు..
చూపించింది చుక్కలు..

వీరు గాక పేర్ని నాని..
ఆళ్ల నాని..
వీళ్ళ నోళ్ళు వేనోళ్ళ తిరస్కారానికి గురయ్యాయి.
వీరు తనను పొగుడుతుంటే..
పవన్ని..బాబుని తిడుతుంటే జగన్ చిందించిన చిద్విలాసాలు ఈరోజున ఇలా నివాసాలనే మార్చేశాయి..

చెప్పుకుంటూ పోతే ఇంకొంతమంది ఉన్నారు..
మొత్తానికి…
అదేదో బాబా..నలభై ఇంకెవరో అన్న చందాన తయారైంది జగన్మోహన రెడ్డి టీం.. కంపు చేసి కొంప మీదకు తెచ్చారు..!

మా ఊరి ఫేస్ బుక్కు నుంచి..

—సురేష్ కుమార్ Ends

Share This Article
Leave a comment