అవే తప్పులు..
Both are s(h)ame..!
Both are s(h)ame..!
అప్పుడు జగన్..
ఇప్పుడు బాబు..!
ఇప్పుడు బాబు..!
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
చంద్రబాబు నాయుడు..
అనుభవం అపారం..
కాని..
లౌక్యం జాస్తి..
విశ్వసనీయత స్వల్పం..
యూ టర్న్స్..చాలా..
ఆయన టీంలో..
నోటి జోరు బ్యూాచికి
లోటు లేదు..
అయ్యన్నపాత్రుడు..
పోలీస్ స్టేషన్లకు వెళ్లి
తన మనుషులను
లాక్కొచ్చిన చరిత్ర..
తెలుగుదేశంలో కొడాలికి
ప్రత్యామ్నాయం..
అప్పుడే అధికారులపై వీరంగం..!
ఇప్పుడు స్పీకర్ పదవి..
సభలో.. బయటా ఎలా ఉంటుందో ప్రవర్తన అదీ చూడాలి..
కింజరపు అచ్చెంనాయుడు..
అదో టైపు..
అధికారం కైపు..
ఆ మధ్య అధికారంలో లేనప్పుడు పార్టీనే కించపరుస్తూ మాటాడినట్టు
వీడియో వైరల్..
పసుపు బిళ్ళలు తగిలించుకుని
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళమని నిన్న గాక మొన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్భోధ..
దీన్ని ఉసిగొల్పడం అంటారు..
నిన్న మొన్నటి వరకు ఉపాధ్యాయురాలు..
ఇప్పుడు హోంమంత్రి..
అయితే దేశానికే ప్రధానమంత్రి
అయిపోయినట్టు మాటలు..
గంటా శ్రీనివాసరావు..ప్రభుత్వం తో పనిలేకుండా..అధినేత అనుమతి తీసుకోకుండా
విశాఖలో రుషికొండ ప్యాలస్ లోకి ప్రవేశం..వీడియోలు..
కొంత గలభా..!
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తల వీరవిహారం..
దాడులు..రెచ్చగొట్టే మాటలు..!
ఇవ్వన్నీ కక్షసాధింపు వైఖరిని
ప్రస్ఫుటం చేస్తున్నాయి.
ఇక పరాకాష్టగా ఆస్తులపై దాడులు..అవి అక్రమ నిర్మాణాలే కావొచ్చు..
కాని..నియమనిబంధనలు
పాటించకుండా కొన్ని..
పాటిస్తూ ఇంకొన్ని…
మొత్తానికి ఆదరాబాదరా..
ఒకే ఒక్కడు
సినిమాలో ఒకరోజు
ముఖ్యమంత్రి చేసినట్టు..
అవసరమా..!
2019లో ఇలాగే..
అధికారం చేపట్టగానే
జగన్ ప్రభుత్వం ప్రగతి భవన్ను కూల్చి వేసినప్పుడు రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది.
ఇప్పుడు ఇంచుమించు
అలాగే చూస్తోంది.
అయినా ఎందుకింత తొందర..
నిజాయితీ అని నిరూపించుకోడానికే గదా..
ఇంకా నాలుగు సంవత్సరాల మూడువందల యాభై రెండు రోజులు ఉన్నాయిగా..
అభివృద్ధిపై ముందు దృష్టి పెడితే..బాగుంటుంది..
బాబు సార్..
జగన్ తప్పులు చేశారని..
అప్పులు పెంచారని..
అభివృద్ధిని మరచి డబ్బులు పంచుకుంటూ వెళ్లారని..
రోజా..నాని త్రయం..అంబటి..
సలహాదారుల నోళ్లకు కళ్లెం వెయ్యలేకపోగా..
వారు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారని.. పైగా నవ్వుతూ కనిపించారని
జనం జగన్ కి ఉద్వాసన చెప్పి మీకు అధికారం కట్టబెట్టారు.
ఇందులో మీ గొప్ప కంటే
మొన్నటి ప్రభుత్వం..
ముఖ్యంగా నాటి అధినేత..ఆయన అనుచరగణం మైనస్సులే
మీకు ప్లస్ అయ్యాయనే విషయాన్ని మీరు గుర్తెరగాలి.
జగన్ రెడ్డికి అనుభవ రాహిత్యం ఉంది.. మరి మీకు..
రమారమి నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం.. ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాల
పద్నాలుగు రోజుల ముఖ్యమంత్రి హోదా..
ఇంకా పూర్తి పదవీ కాలం ఉన్నాయి.మరి అంత తొందరెందుకు ప్రభూ..
ఇంకో విషయం..
జగన్ చరిత్ర ఎలా ఉన్నా ఆయన విపరీతమైన ప్రజాబలంతో మొదటిసారి 2019 లో అధికారం చేపట్టారు.
మరి మీరు..మొదట ముఖ్యమంత్రి ఎలా అయ్యారో
ప్రపంచం మొత్తానికి తెలుసు.
అయినా ఆ పరిస్థితులను
అధిగమించి ఆ సందర్భంలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసి..
మళ్ళీ 1999 లో సొంతంగా అధికారం చేపట్టారు.
ఇక 2014 లో రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.ఇక 2019..24 మధ్య కాలంలో జగన్ నిర్వాకాల వల్ల మరోసారి అధికార పగ్గాలు మీ చేతికి వచ్చాయి.ఇందులో మీ మహిమ కంటే జగన్ రెడ్డిపై వ్యతిరేకత ప్రభావమే జాస్తి.
ఇక్కడ మరో విషయం..
జగన్మోహన రెడ్డికి పరిపాలన అనుభవం లేదు.జనాలకు ఇస్తున్న సొమ్ములే తనను మళ్ళీ గెలిపిస్తాయని ఆయన గుడ్డిగా నమ్మారు.అంతేగాక తన సహజ నైజం కారణంగా
ఆయన తన అనుచరగణం
మితిమీరిన వాచాలత..
దుష్ప్రవర్తనకు అడ్డుకట్ట వెయ్యక తగిన మూల్యం చెల్లించుకున్నారు.
కానీ బాబు సార్..మీ పరిస్థితి
అలా కాదు.మీకు అపారమైన అనుభవం ఉన్న మాట ఎంత నిజమో విశ్వసనీయత లేదన్న సంగతి కూడా ఇంచుమించు అంతే పక్కా..
పెన్షన్ల విషయంలో మీరు గతంలో ఎలా మడత పేచీలు పెట్టారో అందరికీ తెలుసు.
అలాగే మధ్యనిషేధానికి మీరు
1995 తర్వాత ఏ విధంగా తూట్లు పొడిచారో మీకే బాగా ఎరుక.. ఇక పొత్తు ధర్మాలను కూడా మీరు నిజాయితీగా
ఉండరనే సంగతి 2019 ఎన్నికలకు ముందు తెలిసిపోయింది.అలాగే
రాష్ట్ర విభజన సమయంలో మీరు గోడ మీద పిల్లి వైఖరి అవలంబించారు.బిజెపితో కలిసి 2014 లో అధికారం పంచుకున్నా ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో
చిత్తశుద్ధితో పని చెయ్యలేదు.
ఇవన్నీ ప్రజలకు తెలిసినా
ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నట్టు జగన్ పట్ల
వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగానే ప్రజలు మిమ్మల్ని..
మీ కూటమిని గెలిపించారు.
ఇది బలుపు కాదు..వాపు అని నిక్కచ్చిగా చెప్పలేకపోయినా
ఇంత వేగంగా ఈ సలుపు మాత్రం ఆమోదయోగ్యం కాదు.
ప్రజలు ఇప్పటికే..అరె..బాబు..
అంత అనుభవం ఉండి కూడా ఇలా చేస్తున్నారేంటి అని చెవులు కొరుక్కుంటున్నారు.
ముక్కున వేలేసుకుంటున్నారు..
కొండొకచో చిరాకు పడుతున్నారు కూడా..
జనానికి కావలసింది అభివృద్ధి..సంక్షేమం..
ఇప్పటి ప్రజలు తెలివి మీరుతున్నారు.ఎవరు ఏం చేస్తున్నారో నిశితంగా గమనిస్తున్నారు. తప్పులు చేస్తే ఎంతటివారికైనా ఉద్వాసన పలుకుతారన్నది గతంలో
ఇందిరాగాంధీ..జయలలిత..
తాజాగా మన రాష్ట్రంలో
జగన్ విషయంలో చూసాం.
మీ పార్టీ సైతం 1989,2004..2014లో తిరస్కారం ఎదుర్కొన్న సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దానాదీనా తమరికి చెప్పదలచుకున్నది ఏంటంటే..
బాబూ..బహుపరాక్..
తమరేమీ ఇప్పుడు బాహుబలి కాదండోయ్..పైగా బహుముఖులు..
మీరు మూడు పార్టీల త్రికోణంలో ఉన్నారు.
బాగా చేస్తేనే..మార్కులు..
లేదంటే..history repeats
Any time..and many times సుమా..!
సురేష్ కుమార్..జర్నలిస్ట్
9948546286
9948546286