దేశంలో ఎవరికి దక్కని రికార్డులు మోది స్వంతం
నరేంద్ర మోది మూడో సారి గెలిచి హాట్రిక్ సాధించి అనేక రికార్డులు స్వంతం చేసుకున్నారు. వరుసగా మూడో సారి పార్టీని గెలిపించుకుని హాట్రిక్ సాధించి 9 జూన్ 2024 న సాయంత్రం సర్కార్ ఏర్పాటు చేస్తూ సహచర మంత్రులతో కల్సి పదవి ప్రమాణ స్వీకారం చేశారు.
నరేంద్ర మోదీతో పాటుగా రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, గడ్గరీ, నిర్మలా సీతారామన్ తోసహా 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
నెహ్రూ కుటుంబానికి దక్కిన రికార్డులు బ్రెక్ చేయడంతో పాటు దేశంలో ఇప్పటి వరకు పనిచేసిన ప్రధాన మంత్రుల్లో మూడో ప్రధాన మంత్రిగా రికార్డు సాధించారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధి అనంతరం మూడో సారి వరుసగా గెలిచి హాట్రిక్ సాధించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన మూడో వ్యక్తి కూడా నరేంద్ర మోది. ఆ జాబితాలో ఉన్న మరో ఇద్దరు నెహ్రూ, ఇందిరా గాంధీ.
లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం 1966లో తొలిసారిగా ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత, ఆమె 1967 లోక్‌సభ ఎన్నికల తర్వాత మార్చి 1971లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు.
రికార్డులు బ్రేక్ చేయడం మోదీకి కొత్తేమి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎమ్మెల్యే కాకుండా తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్ 7, 2001 న గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక సీఎం నరేంద్ర మోది.
దాదాపు పదమూడు సంవత్సరాల పాటు సిఎం పదవిలో కొనసాగిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి కుర్చీ అధిరోహించారు.
నెహ్రూ తో పోలిస్తే ఆయన పరిస్థితి వేరు నరేంద్ర మోది పరిస్థితి వేరు అని పరిశీలకులు చెబుతుంటారు. నెహ్రూ వరుసగా మూడు సార్లు గెలిచి హాట్రిక్ సాధించిన పరిస్థితి వేరు అని అంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తోలి దశలో ప్రతిపక్షలు అంత బలంగా లేని రోజులని అంటారు. నరేంద్రమోదీకి దేశంలో గట్టి ప్రతిపక్షాలు ఉన్న స్థితిలో రికార్డు సాధించడం మామూలు విజయం కాదని విశ్లేషణ.
రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనందున లోక్‌సభలో సభా నాయకుడిగా ఎన్నడూ వ్యవహరించలేదు. ప్రజల ద్వారా నేరుగా ఎన్నికై లోక్ సభకు వచ్చే ధైర్యం చేయలేక రాజ్యసభకు నామినేట్ అయి ఆ మార్గంలో పార్లమెంటుకు వచ్చారు. లోక్‌సభలో సభా నాయకుడిగా కొనసాగడంతోపాటు వరుసగా రెండుసార్లు పూర్తి స్థాయి సేవలందించిన వారిలో నెహ్రూ తర్వాత మోదీకి ఆ క్రెడిట్ తక్కుతుంది.
వరుసగా 13 ఏల్ల పాటు గుజరాజ్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఆ తర్వాత సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న రికార్డు నరేంద్ర మోది స్వంతం చేసుకున్నాడు. నరేంద్ర మోది మే 26, 2014న భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.
నరేంద్ర మోది రికార్డులపై దేశ విదశీ పత్రికలు అనేక విశ్లేషణలు చేశాయి.