హైదరాబాద్ లో పర్యటనకు వచ్చిన 10 దేశాల మీడియా ప్రతినిధులు.
హైదరాబాద్,జూన్ 26,2024: తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించటానికి 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. ఈస్ట్ ఆసియా, యూరేసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతoలోని జార్జియా, ఆర్మేనియా, ఇరాన్, బెలారస్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, కజకిస్థాన్ దేశాలకు చెందిన ప్రముఖ మీడియా ప్రతినిధులు 4 రోజుల పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా గోల్కొండ కోట, శిల్పారామం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, స్కై రూట్ ఎయిరో స్పేస్ సెంటర్, టి- హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , రామోజీ ఫిల్మ్ సిటీ లను ఈ మీడియా సందర్శిస్తుoది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ డిప్లొమసి డివిజన్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
ఆషాడ బోనాల గురించి విదేశీ మీడియాకు వివరించిన మంత్రి కొండా సురేఖ
నగర పర్యటనకొచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు బుధవారం గొల్కొండ కోటతో పాటు శిల్పారామం సందర్శించారు. గొల్కొండ కోటలో మంత్రి కొండా సురేఖతో విదేశీ మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఆషాడ బోనాల గురించి మంత్రి కొండా సురేఖ మీడియా ప్రతినిధులకు వివరించారు.
———ends