2024- 25 బడ్జెట్ విశ్లేషణ
ఈ మధ్య జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపి ఎంపీల సంఖ్య గణనీయంగా తగ్గింది. దానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయనే అవగాహనకు అటు ప్రభుత్వము ఇటు ఆర్థిక విశ్లేషకులు వచ్చారు. ఆ రెండు కారణాలు పెరుగుతున్న నిరుద్యోగం మరియు ధరలు.
నిర్మల సీత రామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఏడవ బడ్జెట్లో ఈ రెండు సమస్యలను ముఖ్యంగా పరిష్కరించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది.
దేశంలో అందరికీ విధితమైన విషయం ఏమిటంటే స్థూల జాతీయోత్పత్తి ఇతర దేశాల్లో తగుతున్నప్పటికీ మన దేశంలో పెరుగుతూ వస్తున్నది. ఇది మన ప్రభుత్వం చెప్పే గణాంకాల ప్రకారం. అవి ఎంతవరకు నిజమో నిరూపించడం కష్టం. అయినా అవి నిజమని అనుకొని మన యొక్క ఆర్థిక సమస్యలకు ఈ బడ్జెట్ ఎంతవరకు పరిష్కారాలు చూపగలదో కొంతవరకు అంచనా వేయవచ్చు. కొంతవరకే అని ఎందుకు అంటున్నాను అంటే వార్షిక బడ్జెట్లో స్థూలంగా ఒక సంవత్సరంలో రాగల ఆదాయాలను అంచనా వేసి వాటికి చేయగల అప్పులు కలిపి ఆ మొత్తాన్ని ఏ విధంగా ఎన్ని రంగాల్లో మన ఆర్థిక సమస్యల్ని అధికమించేటట్టు ఖర్చు పెట్టాలో చెబుతుంది. ఈ స్థూల వివరాల వల్ల వాటి నిర్వహణలో ఎంతవరకు ఉద్దేశించిన లక్ష్యాలు సాధింపబడతాయి వివరణ ఉండదు. తెలుసుకోవడం కూడా కష్టమే.
ముఖ్యంగా 35 సంవత్సరాల లోపు వయసు గల వారి జనాభా అత్యధిక సంఖ్యలో ఉన్న మన భారతదేశంలో నిరుద్యోగత చాలా ప్రమాదకరమైనటువంటి విషయం.
చాలాకాలం ఉద్యోగాలు కల్పన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జరిగేది. ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ బాధ్యత ప్రైవేట్ రంగానికి అప్పజెప్పడం జరిగింది. అంతేకాకుండా పబ్లిక్ సెక్టర్ని ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదు అని ఉద్దేశంతోనూ లేక పబ్లిక్ సెక్టార్ ల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది అనే కారణం చేతను ప్రభుత్వ రంగాన్ని మూసి వేయడం జరుగుతుంది.
గత పది సంవత్సరాల నుండి పాలనలో అంతకుముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల కాలంలో కూడా నిర్ద్వందంగా నిరూపించబడిన విషయం ఏమిటంటే ఒకవైపు ఆర్థిక అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ అదే నిష్పత్తిలో ఉద్యోగాల కల్పన జరగడం లేదు.
మరి ఈ బడ్జెట్లో, దెబ్బతిన్న బిజెపి ప్రతిపాదించినటువంటి సూచనలు ఉపాధిని పెంచగలవా అనేవి ఈ వ్యాసంలో ముఖ్యంగా చర్చించదల్చుకున్నాను.
మనదేశంలో 2022 సంవత్సర లో సేకరించిన గణాంకాల ప్రకారం 56.5 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారని వారి యొక్క సగటు ఆదాయం నెలకు Rs 13347 గా ఉంది. ఈ సంపాదనతో ఒక్కరు బ్రతకడమే దుర్లభం. అలాంటిది అదే సంపాదనలో మన జనాభా ప్రకారం ముగ్గురు బ్రతకాల్చి వస్తుంది ఎందుకంటే మన జనాభా 140 కోట్లు దాటింది. అందుకే భయంకర దరిద్రం. ఎన్ని విధాల మభ్యపెట్టిన కూడా ఈ గణంకాలు చెప్పే అటువంటి సత్యాన్ని మభ్య పెట్టలేవు.
ఇకపోతే ఈ బడ్జెట్లో ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా మూడు చర్యలు తీసుకోబడ్డాయి. ఇందులో ఏ చర్య ద్వారా కూడా ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో కానీ లేక ప్రభుత్వ రంగ సంస్థల్లో గాని ఉద్యోగాల కల్పనకు అవకాశం లేదు. అంటే ఈ ప్రతిపాదించిన చర్యల ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు చేయూతనివ్వడానికి తీసుకున్న చర్యలే. ఇందులో మొదటిది కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఎవరి జీతం సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ మించకుండా ఉంటుందో వారికి 15000 వారి భవిష్య నిధిలో వేస్తారు. ఉద్యోగాలు కల్పన మాత్రం ప్రైవేట్ రంగం చేయవలసిందే. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో సాంకేతిక విపరీతంగా వాడబడి ఉన్న ఉద్యోగాలు తీసివేయబడుతున్నాయి. మరి అలాంటప్పుడు 15000 కాశించి కొత్త ఉద్యోగాలు వారు ఎలా సృష్టిస్తారు. రెండవ ప్రతిపాదన ప్రకారం ఏ వ్యాపార సంస్థలు అయితే అదనంగా ఉద్యోగాలు కల్పిస్తాయో వారికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు భవిష్యత్తు నిధిలో వేయడం జరుగుతుంది అది కూడా కొంత ఆ ఉద్యోగ కల్పించే వ్యాపారస్తుడే వేయాలి. ఇందులో ఉద్యోగాలు కల్పించారా లేదా అని లెక్కలు వ్యాపారస్తులు ఇచ్చిన ఆధారాల ప్రకారమే నిర్ణయించబడుతుంది. ఇందులో మోసాలు ఉండే అవకాశం చాలా ఉంటుంది.
మూడవది 60 వేల కోట్లతో వచ్చే ఐదు సంవత్సరాలలో 1000 ఐ టి ఐ లు అత్యంత అధునాతనమైన సాంకేతికతతో సృష్టించి ఉద్యోగాలు వచ్చేందుకు కావలసిన నైపుణ్యాలు నిరుద్యోగులకు ఇప్పించడం. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాలు రాకపోవడం నైపుణ్యాలు లేకపోవడం వల్లనే నిర్ధారణకు రావడం.
అయితే ఈ 60 వేల కోట్లలో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలు 30 వేల కోట్లు భరించాలి. అంతేకాకుండా ఈ ప్రతిపాదన ద్వారా లాభపడేటువంటి నిరుద్యోగులు ఇంకా ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి. అది ఈ సంవత్సరపు బడ్జెట్ ద్వారా సహకారం అయ్యే విషయం కాదు. ఇదే నైపుణ్యాల అభివృద్ధి విషయంలో పంచవర్ష ప్రణాళికగా 2 లక్షల కోట్లతో నాలుగు కోట్ల మంది యువతకు నైపుణ్యాలు ఇచ్చేందుకు 500 పెద్దపెద్ద ప్రైవేట్ రంగ సంస్థల్లో వారికి ఇంటర్నెట్ షిప్ అంటే చదువుకున్న తర్వాత వారి యొక్క ఉద్యోగాన్ని సంపాదించిన నైపుణ్యాన్ని పెంచేందుకు ట్రైనింగ్ ఇవ్వడం. దీని ద్వారా పెద్దపెద్ద కంపెనీలకు ఇంకా అదనపాదాయపు అవకాశాన్ని సమకూర్చడమే. కానీ ఈ ప్రతిపాదనలో ఉద్యోగ ఆవశకాశాలు పెంచే ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలు ట్రైనింగ్ తర్వాత చదువుకున్న నిరుద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలి అనేటువంటి నిబంధన మాత్రం లేదు. దీని తర్వాత ఇంత ఖర్చు పెట్టి నైపుణ్యాలు ఇచ్చేసి బయటికి వెళ్లగొట్టడం జరుగుతుంది. ఇది ఎప్పటినుండో జరుగుతున్నటువంటి విషయమే.
మౌలిక సదుపాయాలు ముఖ్యంగా నగరాల్లో కోటి ఇండ్ల నిర్మాణానికి 11 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. వీటి ద్వారా తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి. కానీ వీటిల్లో పని చేసే వారికి ఇండ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఇదివరకే నైపుణ్యాలు ఉన్న వారిని తీసుకుంటారు. వీరు ఇదివరకే ఉద్యోగాలలో ఉంటారు. మీరు ఒక ప్రాజెక్టు నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కి వెళ్లడం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కల్పన అనేది కొంతవరకే అయినా అవి కూడా మళ్లీ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత మాయమవుతాయి.
శాశ్వత ప్రాతిపదిక మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ కూడా ఎవరికి ఉద్యోగాలు రావనేది నిజం. అందుకే ప్రతి బడ్జెట్లో ఉద్యోగా కల్పనకు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా నిరుద్యోగత రోజురోజుకు పెరుగుతుంది గాని తగ్గడం లేదు.
మౌలిక సదుపాయాలకు అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించడం వల్ల అమౌలిక సదుపాయాల నిర్మాణంలో పాలుపంచుకునేటువంటి బడ వ్యాపారస్తులు సంతోషపడ్డారు కానీ ఎక్కడ కూడా యువత ద్వారా ఉత్సాహమైన స్పందన వచ్చినట్టు కనబడడం లేదు.
ప్రతి సంవత్సరం నూతన ఉద్యోగాలు కల్పించడం ఇప్పటి వరకే ఉన్న ఉద్యోగస్తులు యొక్క జీతాలు కనీసం ద్రవయోల్బణానికన్నా ఎంతో కొంత ఎక్కువగా పెరగడం జరిగితేనే వస్తు సేవలకు డిమాండ్ పెరిగి, వాటిని కల్పించేందుకు కొత్త సంస్థలు వచ్చి అప్పుడు నిజమైన అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని ఇలాంటి కందుడుపు తాత్కాలిక చర్యల వల్ల పెద్దగా నిజమైన అభివృద్ధి జరిగి ఆర్థిక సమానత్వం పెరిగి సమసమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుంది అనేది కల.
ఆహారము మరియు కూరగాయల ధరల అదుపుదలకు ప్రతిపాదించిన సూచనలు కూడా దీర్ఘకాలికమైనవి. కాబట్టి ఈ బడ్జెట్ కాలంలో వాటి ద్వారా పెద్ద ప్రభావం ఏమీ ఉండదు. కోటి వ్యవసాయదారులని ఆర్గానిక్ పంటల వైపు తరలించటం అనేది ఊహించిన ఐదు సంవత్సరాలలో అసంభవం. అయినా పరిశోధనలు ఆర్గానిక్ పంటల ద్వారా దిగుబడి కొంత కాలం వరకు తక్కువవుతుందని చెబుతారు. అలాంటిది పంట దిగుబడి పెరిగి ధరలు ఎలా తగ్గుతాయి.
బడ్జెట్ ని ఇలా ప్రతి విషయంలో విశ్లేషించుకుంటూ పోతే నిరాశే మిగులుతుంది. ఎందుకంటే ప్రతి భారతీయుని మీద లక్షన్నర రూపాయల అప్పు ఉంది. 140 కోట్ల భారతీయుల మీద మొత్తం రెండు కోట్ల కోట్ల రూపాయల అప్పు ఉంది. అది 48 కోట్ల (అందులో 14 లక్షల అప్పు) బడ్జెట్ తో ఎన్ని సంవత్సరాలకు ఎంత ఆర్థిక లోటు తక్కువ చేసిన తీరేది కాదు.
కాబట్టి ఈ బడ్జెట్లోని ఇదే ఆదాయంతోని 2047 కాదు కదా 2147 వరకు కూడా మనం అభివృద్ధి చెందిన దేశంగా కాలేము. నిజంగా అభివృద్ధి చెందిన దేశం కావాల్సిన అవసరం లేదు. కావాల్సింది ఏందంటే ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం. దీన్ని ఫ్రెంచి ఆర్థిక వేత్త థామస్ పికెట్ చెప్పినట్టు ధనికుల దగ్గర ఎక్కువ పన్నులు వసూలు చేసి ఆ డబ్బు ద్వారా ఉత్పాదికత పెంచే ఉపాధి కల్పించే సత్వర అభివృద్ధి విధానాలు చేపట్టాలి.
డాక్టర్ ఎమ్ హెచ్ ప్రసాద్ రావు
విశ్రాంత పాలిటెక్నిక్ శాఖ అధిపతి
కెపిహెచ్బి కాలనీ సిక్స్త్ పేజ్
శ్రీరంగా విహార అపార్ట్మెంట్స్
9963013078