మొదలైన సర్వే వివరాల కంప్యూటరీకరణ

Admin
By Admin

 

*రాష్ట్రంలో 90 శాతం సర్వే పూర్తి*

*సర్వే వివరాల కంప్యూటరీకరణ*
ప్రారంభం.

హైదరాబాద్, నవంబర్ 23 :: సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల గణన సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాల కంప్యూటరీకరణ పలు జిల్లాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే, పలు జిల్లాల్లో సర్వే పూర్తి కాగానే, మరి కొన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా ఉంటుంది. సర్వే కొనసాగుతుండగానే, ఇదే సమయంలో డాటా ని కంప్యూటరీకరణ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు కలెక్టర్లు ప్రారంభించారు. ఈ సర్వే డాటా నమోదులో తప్పులు జరగకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. ఎన్యుమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ వివరాల నమోదును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రంగా భద్రపరచాలన్నారు. సర్వే పత్రాల భద్రత విషయంలో తాగు జాగ్రత్త తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,93,698 నివాసాలు గుర్తించగా, నేటివరకు 1,05,03,257 నివాసాలలో సర్వే పూర్తి చేసింది. 89.8 శాతం సాధించింది. సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ రోజు 2,61,384 నివాసాలకు సంబంధించిన సర్వే వివరాలు కంప్యూటరీకరణ చేయడం జరిగింది.
జి.హెచ్.ఎంసీ పరిధి లో కూడా సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. జిహెచ్ ఎంసీ పరిధి లో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా నేటి వరకు 17,47,056 నివాసాలు సర్వే పూర్తిచేసి 70 శాతం చేరుకుంది.
——-

Share This Article
Leave a comment