ఎబికె ప్రసాద్ ABK Prasad తెలుగు జర్నలిస్ట్ కమ్యూనిటీలో సుప్రసిద్దులు. లోకం చుట్టిన వీరుడిలా ఆయన అన్ని తెలుగు పత్రికలకు ఎడిటర్ గా పనిచేసారు. రామోజీ రావు Ramoji Rao వ్యవస్థాపకత్వంలో ఎబికె సంపాదకత్వంలో ఆ నాడు “ఈ నాడు దిన పత్రిక” Eenadu Telugu Daily వెలువడింది. ఈనాడు పత్రికలో చీఫ్ ఎడిటర్ గా ఎబికెను తీసుకంటానని రామోజి రావు మాట ఇచ్చి పత్రిక వెలువడే పది రోజుల ముందు మాట మార్చారు.
తెలుగు నాట రామోజి రావు వార్తను పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్కెట్ చేసి ఎవరికి సాధ్యం కాని తన దంటూ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నారు. ఆయన ఏ రంగంలో విస్తరించినా దానికి పునాదిగా ఉపయోగపడింది మాత్రం ఈ నాడు పత్రిక. రామోజి రావు ఎలాంటి వారో ఎబికె ప్రసాద్ గారు అనేక సందర్బాల్లో చెప్పారు.
పచ్చల్లకు, పత్రికలకు తేడాతెలియని మనిషంటూ ఎబికె ప్రసాద్ రామోజి రావును ఏకి పారేసిన సందర్భాలు ఉన్నాయి.
ఎబికె రామోజి గురించి ఏం చెప్పాడంటే ఆయన మాటల్లో….
“రామోజీ రావు ఎప్పుడూ పేపర్‌పై ఏమీ రాసి ఎరుగరు. కానీ న్యూస్ పేపర్‌కి చీఫ్ ఎడిటర్‌గా ప్రకటించుకున్న మొదటి వ్యక్తి అతనే. భారతదేశ చరిత్రలో ఇంతకు ముందు మరెవ్వరూ అలా చేయలేదు. పాశ్చాత్య దేశాలలో ఇలాంటి ధోరణులు ఉన్నాయి. ఈ ఒరవడి రామోజి రావుతోనే ప్రారంభ మైంది. ఇప్పుడు ఏ సంపన్నుడైనా ఒక పత్రికను లేదా వార్తాపత్రికను ప్రారంభించి తన పేరును ప్రధాన సంపాదకునిగా పేర్కొనవచ్చు.
నేను ఈనాడులో పని చేస్తున్నప్పుడు రామోజీయే రాశాడని, ఒక వ్యక్తిని సంపాదకీయం రాసేటట్లు చేసి, ఎడిటోరియల్‌లు, ఎక్స్ క్లూజివ్ లు పెట్టాలనే ఆలోచనను నేనెప్పుడూ అంగీకరించలేదు. రామోజీ రావు వాటిని రాయనప్పుడు ఆయన చేసిన సంతకం ఎందుకని అడిగే వాన్ని . రామోజీరావు దేనికైనా డబ్బులను లెక్కగట్టుకునే మనిషి. ఈనాడు వ్యాపారంలో అదొక్కటే ఆయన ప్రాధాన్యత. ఏ మాత్రం నైతిక విలువలు లేని మనిషి. అతని అనైతిక చర్యలకు నేనే మొదటి బాధితుడిని. ఆంధ్రజ్యోతి కేఎల్‌ఎన్ ప్రసాద్ నాకు ఢిల్లీ కరస్పాండెంట్‌గా వెళ్లమని ఆఫర్ ఇచ్చి అడిగారు.
అదే సమయంలో పత్రిక ప్రారంభించే ఆలోచనల్లో ఉన్న రామోజి రావు విషయం నా మిత్రుడు వి. హన్మంతరావు నాకు చెప్పారు. ఈనాడు పత్రికలో చీఫ్ ఎడిటర్‌గా పనిచేసేందుకు రామోజీరావుగారు వి హనుమంతరావు ద్వారా ఆఫర్ ఇవ్వడంతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆఫర్‌ని వదిలేశాను.
అప్పట్లో వైజాగ్‌లో డాల్ఫిన్ హోటల్ నిర్మాణంలో ఉంది. ఎడిటర్‌గా ఆ ఆఫర్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నా టీమ్‌తో పగలు, రాత్రి చాలా పనిచేశాను. అయితే ఈనాడు పత్రిక మార్కెట్‌లోకి రావడాని 10 రోజుల ముందు నా విషయంలో రామోజి రావు నాలుక మెలేసారు. మేము డాల్ఫిన్ హోటల్ లాన్‌లో నడుస్తున్నాము. అతను అకస్మాత్తుగా నాతో అన్నాడు, “నేను నిన్ను అసిస్టెంట్ ఎడిటర్‌గా తీసుకున్నాను…’ అని. అది విని నేను ఆశ్చర్యపోయాను.
” అదేంటి నన్ను చీఫ్ ఎడిటర్‌గా కదా తీసుకున్నారు. అయినా ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు” అని అడిగాను.
మీరు హనుమంతరావుతో మాట్లాడండి.. ఆయన మాటకు కట్టుబడి ఉంటాను అంటూ రామోజిరావు అన్నారు.
ఆతర్వాత నేను హన్మంతరావుతో మాట్లాడటం నా తరపున హనుమంతరావు రామోజీ రావుతో మాట్లాడటం జరిగింది. హన్మంత రావు నాకు ఇచ్చిన మాట ప్రకారం తన నిర్ణయంపై నిలబడ్డారు. కాని చివరి క్షణం వరకు రామోజి రావు మౌనంగానే ఉండి మార్కెట్‌లో ‘ఈనాడు’ విడుదల కావడానికి కేవలం 2 గంటల ముందు ఆయన పేరును చీఫ్ ఎడిటర్‌గా ముద్రించి నాకు అసిస్టెంట్ ఎడిటర్ స్లాట్ ఇచ్చారు. అంటూ ఎబికె ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ వారం అనే వార పత్రిక 2007 లో ఎబికె గారిని ఇంటర్య్వూ చేసి ఈ వార్తను ప్రచురించింది. అందులో తనకు జరిగిన అవమానం రామోజి రావు సంపాదకత్వ ప్రస్తానం గురించి వివరించారు.
పోయినోళ్లందరూ మంచి వాళ్లే అన్నట్లు చెప్పుకోవడం మన సాంప్రదాయం. రామోజి రావు గురుంచి చెడుగా ప్రచారం చేసే దురుద్దేశంతో పాత విషయాలన్ని తేవనెత్తడం కాదు. జగమంతా వర్దిల్లే వార్తల వెనకాల పెట్టుబడి దారుల నిజ రూపాలు కూడ ప్రజలకు అవసరం.
తెలుగు నాట పత్రికా రంగం గురించి చెప్పాలంటే రామోజి రావు ముందు అ తర్వాత అని చెప్పుకోవాలి. రామోజి రావు పత్రికకు కేవలం పెట్టుబడి దారుడు మాత్రమే. వందలాది వేలాది మంది ఎబికె ప్రసాద్, వి హన్మంత రావు వంటి జర్నలిస్టు శ్రమ జీవులు తమ స్వేధాన్ని దార బోసి రక్తం ఆవిరి చేసుకుని కండలు క్షీణింప చేసుకుని ఆ పత్రికను నిల బెట్టారనే సత్యం సమాధి కాకుండా తెలుగు ప్రజలు గ్రహించాలి.
ఈ ఎడిటోరియాలు అక్షర సత్యం రామోజీరావు ఒక వ్యాపారస్తుడు
ప్రింట్ మీడియాను టీవీలలో కళా రూపాల్ని వ్యాపారం చేసి వాటికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తగ్గించాడు
కమ్మ రాజకీయ నాయకులకు తన ధన బలంతో కాపుకాశాడు
రామోజీ ఫిలిం సిటీ ద్వారా విపరీతంగా డబ్బులు సంపాదించడమే కాకుండా సామాన్య మానవునికి అందనంత స్థాయికి టికెట్ పైసలు పెంచేశాడు
మన తెలంగాణ నాయకులు ఇప్పటికీ ఇలాంటి వారికి కొమ్ము కాయడం వల్ల దురదృష్టం
డాక్టర్ ఎంహెచ్ ప్రసాద్ రావు