ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం

Admin
By Admin

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు OhNEWS DAILY.IN  బాధ్యత వహించదు.)

 

ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని మనలో చాలా మంది అనుకుంటారు. సూర్యోదయం తో పాటే లేచి వ్యాయామం చేయాలని మంచి ఆహారం తీసుకోవాలని ఉంటుంది కాని ఉరుకులు పరుగుల జీవితంలో సాధ్యం కాక ప్లాన్లు మారిపోతుంటాయి.

ఉద్యోగాలు ఇతర జీవనోపాధి పనుల్లో ఉండే వారికైతే వారి వారి ఉద్యోగాన్ని బట్టి ట్రెస్ తీరిక అవకాశాలు ఉంటాయి. తీరిక లభించకుండా సెలవులు ఎక్కువగా లేని కొలువులతో ఎక్కువ  ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆహార నియమాలు పాటించాలనుకున్నా   పాటించ లేరు. వ్యాయాయం చేయాలన్నా చేయలేరు. ఇట్లాగే రోజులు గడిచి ఆరోగ్య సమస్యలు పెరిగి అవస్థలు పడుతుంటారు.

ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని గగ్గోలు పెడ్తున్నాం  కాని వెనకటి రోజుల్లో మన తండ్రులు, తాతల జీవన శైలి ఏ విదంగా ఉండేదో ఒక్క సారి వెనక్కి వెళ్లి చూడండి. మనకన్నా ఎక్కువ కాయకష్టం చేసి బ్రతికారు. ఒళ్లు దాచుకోకుండా ఎండనకా వాననక పనిచేసారు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోయారు.

ఇక్కడే మీరు ఏం చెప్పాలనుకుంటారో తెల్సు. వాళ్ల తిండి వేరు మన తిండి వేరు అప్పటి తిండి ఇప్పుడు దొరకడం లేదని మనమే చెబుతుంటాం. ఇది వాస్తవం కాదు.

వారు తిన్నతిండి ఇప్పుడు కూడ అందుబాటులోనే ఉంది. కాకపోతే మనమే వాటికి దూరంగా ఉంటున్నాం. జంకు పుడ్డు వచ్చింది కదా మరి. మైదా తో చేసిన బేకింగ్ ఐటంలు రోడ్డు పక్కన నేపాలి కుర్రాళ్ళు మసాలాలు దట్టించి అమ్మే  నూడిల్స్, వెజ్, చికెన్ మంచూరియాలు ఇంకా ఇంకా బోలెడు వెరైటీలు. వీటికి తోడుగా ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ అబ్బో బజారులో తినేందుకు చాలా ఉంటాయి.

ఏంలేదు…లైఫ్ స్టైల్ మనమే వెస్టర్న్ స్టైల్ మోజులో పడి చేజేతులా నష్ట పడ్డాం.

ఒళ్ళెక్కి బరువు పెరిగి బద్దకించి పోయాం….బరువు తగ్గించుకోండిలా అంటూ అనేక మంది ప్రకటనలు చూసి వేలకు వేలు కుమ్మరించి ప్రొటీన్ పౌడర్లు, ప్రోబయాటిక్ పౌడర్లు తీసుకుని  ఏం ఫలితం దక్కక నీరసించి పోతున్నారు.

ఏంచేయాలంటే….

అన్ని పక్కన పడేయండి…కాసేపు అన్ని మరిచి పోండి. ఒక్క సారిగా టైం మిషన్ను గిర్రున మీ తాతల కాలం నాటికి తిప్పండి. వారి ఆహారపు అలవాట్లు చూడండి.

వారు తిన్న తిండి ఏంటి…. పొద్దున్నే  వడా, పూరి, ఉప్మా, దోష కాదు…. చద్దన్నం. రాత్రి పడుకునే ముందు అన్నంలో పాలు పోసి తోడు పెట్టి తెల్లవారే తినేవారు.

అంచుకు కొద్దిగా పచ్చడి వేసుకుని లేదా పచ్చిమిరపకాయ, ఉల్లి పాయతో నంజుకు తినేవారు.

ఇలా మీరు కూడ ఓ నెల రోజులో నలభై రోజులో చేసి చూడండి. తేడా మీకే తెలుస్తుంది. దీంతో పాటు టీలు, కాఫీలు  తగ్గించండి. పంచదార వేసే టి పానీయాలకు పూర్తిగా  దూరంగా  ఉంటే వీటితో సగం ఆరోగ్య సమస్యలు సమసి పోతాయి.

ఆహారంలో  ఆకు కూరలు కూరగాయలతో వేపుడు లేకుండా చేసిన కూరల భాగం పెంచండి.  కీర దోస ముక్కలు, కారట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు తప్పనిసరిగా తీసుకోండి. ఆకు కూరల తో చేసిన రసం లేదా కారెట్, కీరా బీట్ రూట్ తో చేసిన జూస్ తాగండి.

అల్లం, వెల్లుల్లి, సొంటి, జీలకర్ర, వాము, పసుపు, మెంతులు, ధనియాలు ఆహారంలో బాగా తీసుకోండి. నాన్ వెజ్ కన్నా పప్పు దినుసులు బెట్టర్ అని చెబుతున్నారు. పప్పు దినుసుల్లో నాన్ వెజ్ కన్నా ఎక్కువగా ప్రొటీన్ దొరుకుతుంది.

వీలైతే డ్రైప్రూట్స్, తృణ ధాన్యాల గింజలు గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసె గింజలు, నువ్వులు,పల్లీలు రోజూ తీసుకోండి.

అన్నిటికన్నా మించి బబ్బెర్లు, పెసల్లు, శనిగలు, చిక్కుల్లతో గుడాలు వేసుకుని ఎక్కువగా కాకుండా గుప్పెడు గుప్పెడు తినండి.  మొలకలతో తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.

మక్కజొన్నలు,పజ్జొన్నలతో కూడ టేస్టీగా గుడాలు వేయవచ్చు.

ఆహారంతో జీవన శైలి మార్చుకుంటే అన్ని రోగాలు నయం అవుతాయి. ఏ డాక్టర్ అవసరం లేదు. మన పోపుల డబ్బానే మనకు డాక్టర్. ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల మంచి అవగాహన పెంచుకోండి.  వైద్యులు మందుల జోలికి త్యవసరం అయితే తప్ప వెళ్లకుండా ఆయుర్వేద, నేచురోపతి విధానంలో ప్రయత్నాలు చేయండి.

ఏదైనా కొంత సమయం పడుతుంది.  ఫలితాలకు కొన్ని రోజులు వేచి చూడాలి.

అది తినద్దు…. ఇది తినద్దు…. అంటే జంకు ఫుడ్ కాకుండా ఇంట్లో కూరగాయలు, ఆకు కూరలు,  పండ్లతో ”షడ్రసోపేత భోజనం” చేయండి.

ఉగాది రోజు తీపి చేదు వగరు పులుపు ఎలా తింటామో అలా తినండి…ఇదే షడ్రసోపేత భోజనం అంటే.. ప్రకృతిలో లబించే ఆహార పదర్థాలు మనకు అమృతంతో సమానం. ఉడికీ ఉడకకుండా ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా కచ్చాపక్కాగా వండి తినండి.

వీటికి తోడు నిత్యం  నడకతో పాటు మీ శరీర బాగాల్లోకదలికలు ఉండే విదంగా ఇంటి పనులో తోట పనులో చేయండి. స్వేధం చిమ్మితే బాడీలో ఉండే టాక్సిన్స్ బయటికి వచ్చి శరీరం తేలిక పడుతుంది. ఇంకా సమయం చిక్కితే అన్ని మరిచి పోయి  ప్రశాంతంగా  కాసేపు పరధ్యానంలో ఉండండి. దీన్నే  మనవాళ్లు మెడిటేషన్ అంటున్నారు. క్రీస్తు పూర్వం బుద్దుడు మానవళికి నేర్పిన ఆరోగ్యసూత్రం ఇది. కాసేపు కళ్లు మూసుకుని ప్రశాంతంగా  ఉఛ్వాస నిశ్వాసలపై మనసు నిలపడమే  ధ్యానం.

ప్రస్తుతం బాగా డిమాండ్ పెరిగిన ప్రకృతి ఆశ్రమాల్లో వేలకు వేలు తీసుకుని చేస్తున్నదిదే. ఎవరింటిని వారు ఓ ప్రకృతి వనం చేయండి.

మీరు సరే… మీపిల్లలకు ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన కల్పించండి…ఏం చినాలో ఏం తినకూడదో చిన్న తనం నుండే అలవర్చండి.

 

 

 

TAGGED:
Share This Article
Leave a comment