చౌక ధరల దుకాణాల్లో ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాధ్ తెలిపారు.
అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చౌక దుకాణాలు ద్వారా ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన బుధవారం ఒక ప్రకటన. విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి, సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. జిల్లాలో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసాయని సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్లాస్టిక్ బియ్యం సరఫరా లేదని అవి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యమని, ప్రజలు ఆందోళన చెందోద్దని సూచించారు.

ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారన్న ప్రచారం అవాస్తవం -పౌరసరఫరాల శాఖ
Releated Posts
14న రామప్పకు సుందరాంగులు- సందర్శకులకు అనుమతి లేదు
ఈ నెల 14న రామప్ప కు పర్యటకుల అనుమతి లేదు. మిస్ వరల్డ్ పోటీ మహిళలకు ప్రతి ఒక్కరు సహకరించాలి. జిల్లా కలెక్టర్ దివాకర…
జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన హనుమకొండ…
బాలిక చదువుకు ఆర్థిక సహాయం మంత్రి…పొంగులేటి ఔదార్యం
ఉదారత చాటుకున్న మంత్రి పొంగులేటి….▪️బాలిక చదువుకు ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి…. వరంగల్ 29 ఏప్రిల్ 2025 : వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్…
గిరిజన కళలపై వేసవి శిబిరం
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ.శరత్ ఆదేశాల మేరకుహైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో ఉన్న గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణసంస్థలో గిరిజన…