*డిసెంబర్ 8 వ తేదీ నుండి 16 వరకు అగ్నివీర్ ల రిక్రూట్ మెంట్ ర్యాలీ*
హైదరాబాద్, నవంబర్ 23 :: GMC బాల యోగి అథ్లెటిక్ స్టేడియం గచ్చిబౌలి, రంగా రెడ్డి, తెలంగాణలో అగ్నివీరులుగా చేర్చుకొవడానికి భారతీయ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ 08 డిసెంబర్ నుండి 16 డిసెంబర్ 2024 వరకు నిర్వహించబడును.
తెలంగాణలోని 33 జిల్లాల నుండి సైన్యంలోకి ఆభ్యర్థులను అగ్నివీరులుగా చేర్చుకొవడానికి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ 08 డిసెంబర్ 2024 నుండి 16 డిసెంబర్ 2024 వరకు GMC బాల యోగి అథ్లెటిక్ స్టేడియం రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించ బడుతుంది..
తెలంగాణ లోని 33 జిల్లాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ మరియు యాదాద్రి భువనగిరి అభ్యర్థులకు అగ్నివీర్ జనరల్ డూటి, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ అగ్నివీర్ ట్రెడ్స్ మెన్ 10th ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ 8th ఉత్తీర్ణత కేటగిరీలకు ర్యాలీ నిర్వహించబడును. మహిళా మిలిటరీ పోలీస్ (WMP) అభ్యర్థులకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కేంద్ర పాలిత ప్రాంతము పుడుచ్చెరి (కరైకల్ – యానాం) నుండి మహిళా మిలిటరీ పోలీస్ (WMP) అభ్యర్థులు, ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ సైట్ కి అన్ని డాక్యుమెంట్ లను తీసుకురావాలి.
రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తిగా అటోమేటేడ్, ఫెయిర్ మరియు పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా ఉత్తర్ణత సాధించడానికి లెదా నమోదు చేసుకోవడానికి సహాయం చేయగలమని క్లెయిమ్ చేసే మోసపూరిత ట్వీట్ లు / మోసగాళ్ల నుండి అభ్యర్తులు జాగ్రత్త వహించాలి. రిక్రూట్ మెంట్ కార్యాలయం (టెలి నంబర్ 040-27740059, 27740205) నుండి అన్ని రిక్రూట్ మెంట్ సంబంధిత సందేహాలను స్పష్టం చేయవచ్చు.